ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pennsylvania Police Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి

ABN, Publish Date - Sep 18 , 2025 | 06:45 AM

అమెరికాలోని పెన్సిల్వేనియాలో బుధవారం వెలుగు చూసిన కాల్పుల ఘటనలో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నార్త్ కొరొడస్న్‌టైన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది.

Pennsylvania Police Shooting

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఓ కుటుంబంలో తగాదా రేగినట్టు ఫిర్యాదు అందడటంతో వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఫిలడెల్ఫియాకు పశ్చిమాన సుమారు 115 మైళ్ల దూరంలో ఉన్న నార్త్ కొరొడస్ టౌన్‌షిప్‌లో బుధవారం ఈ దారుణం జరిగింది. గాయపడ్డ పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానిక యార్క్ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది (Pennsylvania Police Shooting).

అయితే, నిందితుడి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. మృతి చెందిన పోలీసులు ఏ విభాగానికి చెందిన వారో కూడా తెలపలేదు. కాల్పులకు గల కారణం కూడా తెలియాల్సి ఉంది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడించేందుకు కొంత సమయం పడుతుందని పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసు కమిషనర్ క్రిస్టఫర్ పారిస్ పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి పారదర్శకమైన విచారణ నిర్వహించి కారణాలు కనుగొనే వరకూ తాము విశ్రమించబోమని అన్నారు. ఈ ఘటన భరింపరాని వేదన మిగిల్చిందని అన్నారు (North codorus township shooting).

ఘటనపై గవర్నర్ జాష్ షెపీరో కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. ఇంతటి హింస అస్సలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. సమాజం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు (us police officers killed).

పోలీసులపై హింసాత్మక ఘటనలు జరగడం సమాజానికి పట్టిన పీడ అని అటార్నీ జనరల్ పామెలా బాండీ వ్యాఖ్యానించారు. స్థానిక పోలీసులకు మద్దతుగా ఫెడరల్ అధికారులు కూడా విచారణలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. మృతులు, వారి కుటుంబాలు, గాయపడ్డ పోలీసుల కోసం తాను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

ఘటనా స్థలంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవ్వరినీ అక్కడకు అనుమతించకుండా పలు రోడ్లల్లో కార్లను అడ్డుగా నిలిపి బ్లాక్ చేశారు. పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసులు, నార్తన్ రీజియన్ పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని స్థానిక కౌంటీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఫిబ్రవరిలో స్థానికంగా వెలుగు చూసిన మరో కాల్పుల ఘటనలో ఓ అధికారి మృతి చెందారు. తుపాకీతో ఆసుపత్రిలోకి వచ్చిన ఓ ఆగంతుకుడిని నిలువరించే ప్రయత్నంలో అతడు కన్నుమూశాడు.

ఇవి కూడా చదవండి:

కార్పొరేట్ సంస్థలు విదేశీ వర్కర్లను అమెరికాకు తీసుకురావచ్చు: ట్రంప్

భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 18 , 2025 | 06:56 AM