Pakistan fake football team: పాకిస్థాన్ నకిలీ ఫుట్‌బాల్ టీమ్.. జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Sep 17 , 2025 | 09:39 PM
జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కొందరు పాకిస్థాన్ పౌరులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పాకిస్థాన్ ఫుట్‌బాల్ జట్టు పేరుతో వచ్చిన 22 మంది పౌరులను జపాన్ అధికారులు వెనక్కి పంపించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు పేరుతో 22 మంది జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కొందరు పాకిస్థాన్ పౌరులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పాకిస్థాన్ ఫుట్‌బాల్ జట్టు పేరుతో వచ్చిన 22 మంది పౌరులను జపాన్ అధికారులు వెనక్కి పంపించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు పేరుతో 22 మంది జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారి దగ్గర పాక్ విదేశాంగ శాఖ జారీ చేసిన నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. దీంతో ఫుట్‌బాల్ టోర్నీల నిర్వాహకులకు ఎలాంటి అనుమానమూ రాలేదు (Pakistan fake football team).
పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ విమానాశ్రయం నుంచి ఆ 22 మంది జపాన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విచారణ సమయంలో జపాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు వారిపై అనుమానం వచ్చింది. దీంతో దర్యాఫ్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఆ 22 మంది అక్రమ చొరబాటుదారులని గుర్తించిన జపాన్ అధికారులు వారిని వెనక్కి పంపించేశారు (Japan airport deportation). పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌కు చెందిన మాలిక్ వకాస్ అనే వ్యక్తి వీరిని అక్రమంగా జపాన్ పంపించడానికి ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది (fake team scandal).
గుజ్రాన్‌వాలాలోని ఎఫ్‌ఐఏ అధికారులు మాలిక్ వకాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు (fake sports team). ఈ 22 మందిని అక్రమంగా జపాన్ పంపించేందుకు మాలిక్ వకాస్ 'గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్' పేరుతో ఓ ఫుట్‌బాల్ క్లబ్‌ను ప్రారంభించాడు. జపాన్ పంపిస్తానని ఆశ చూపించి ఈ 22 మంది నుంచి మాలిక్ కోటి రూపాయలకు పైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. జపాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల సమగ్ర దర్యాఫ్తు సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 17 , 2025 | 09:39 PM