ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PoJK Protests: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత, ప్రత్యేక దేశం డిమాండ్!

ABN, Publish Date - Oct 03 , 2025 | 12:45 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తీవ్ర ఉద్రిక్తతలతో అల్లకల్లోలంగా మారింది. లోయంతా ప్రత్యేక దేశం డిమాండ్లు, ఆర్థిక అసంతృప్తి, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘర్షణలు దాదాపు పది మంది మృతికి కారణమయ్యాయి.

PoJK Protests

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తీవ్ర ఉద్రిక్తతలతో అల్లకల్లోలంగా మారింది. లోయంతా ప్రత్యేక దేశం డిమాండ్లు పెల్లుబికుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పాకిస్తాన్ ప్రభుత్వం హుటాహుటీన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 8 మంది సభ్యులతో కమిటీని ముజఫరాబాద్‌కు పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల మార్గమే మంచిదని షెహబాజ్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఈ బృందంలో అహసన్ ఇక్బాల్, అమిర్ ముఖ్తార్, రాజా పర్వేజ్ అష్రఫ్‌లు కీలక సభ్యులుగా ఉన్నారు. పాక్ పాలిత కశ్మీర్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని షరీఫ్, పారదర్శక పరిశోధనకు ఆదేశించారు. ఈ అల్లర్లు ఆర్థిక అసంతృప్తి, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఈ స్థితికి చేరాయని ప్రధాని నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా, పాక్ దళాలతో జరిగిన తాజా ఘర్షణల్లో ఇప్పటి వరకూ 10 మందికి పైగా స్థానిక ప్రజలు మరణించారు. డజన్ల కొద్దీ జనం తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిన్న ముజఫరాబాద్‌లో సివిల్ సొసైటీ అలయన్స్‌తో ప్రభుత్వ బృందం ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. శుక్రవారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

Updated Date - Oct 03 , 2025 | 12:49 PM