ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NATO: భారత్‌పై వంద శాతం సుంకాలు విధిస్తాం

ABN, Publish Date - Jul 17 , 2025 | 06:19 AM

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తే వంద శాతం టారి్‌ఫలు విధిస్తామని నాటో.. భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్‌లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టె మాట్లాడారు.

  • రష్యా చమురు కొనుగోలుపై నాటో హెచ్చరిక

వాషింగ్టన్‌, జూలై 16: రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తే వంద శాతం టారి్‌ఫలు విధిస్తామని నాటో.. భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్‌లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టె మాట్లాడారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్‌ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని వ్యక్తి (రష్యా అధ్యక్షుడు పుతిన్‌) శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. తాము తీసుకునే చర్యలతో ఏర్పడే పరిణామాలు భారత్‌, చైనా, బ్రెజిల్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు. వెంటనే పుతిన్‌కు ఫోన్‌ చేసి శాంతి చర్చలను గట్టిగా పరిశీలించాలని ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఈ మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని రుట్టె హెచ్చరించారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగియాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించడమే అంతిమ మార్గమంటోన్న అమెరికాకు నాటో వత్తాసు పలుకుతోంది. సుంకాలపై ట్రంప్‌ హెచ్చరించిన గంటల్లోనే మార్క్‌ రుట్టె వార్నింగ్‌ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై వంద శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. అలాగే రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలపై 500ు సుంకాలు విధిస్తామని కూడా అమెరికా హెచ్చరించింది. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్‌, చైనా, బ్రెజిల్‌ ఉన్నాయి. మరోవైపు అమెరికా హెచ్చరికలను రష్యా కొట్టిపారేసింది. ఇప్పటికే తాము అనేక ఆంక్షలు ఎదుర్కొని నిలిచామని, మున్ముందూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

Updated Date - Jul 17 , 2025 | 06:19 AM