ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JD Vance: మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:01 PM

ట్రంప్‌ను విమర్శిస్తున్న మస్క్ పెద్ద తప్పు చేస్తున్నట్టేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా అన్నారు. కాస్త కూల్‌గా ఆలోచించాలని మస్క్‌కు సలహా ఇచ్చారు.

Musk Trump feud

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా స్పందించారు. ఆయన మళ్లీ ట్రంప్‌తో సఖ్యత ఏర్పరుచుకోవాలని అభిలషించారు. మస్క్ తప్పు చేస్తున్నారని కూడా అన్నారు. థియో వాన్‌తో పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘తాజా బిల్లులో ఉన్న విషయాలతో మస్క్ ఏకీభవించాలని నేను అనడం లేదు. అన్నింటికీ యస్ అంటూ తల ఊపాలని చెప్పట్లేదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ తప్పు చేస్తున్నారని మాత్రం చెప్పగలను. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన వ్యక్తితో మస్క్ తలపడుతున్నారు. ట్రంప్ దేశం కోసం ఎంతో చేశారు. ఇంతటి సేవ చేసిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు’


‘ట్రంప్ పట్ల కాస్తంత గౌరవమైనా చూపించాలి. అన్ని అంశాల్లో ట్రంప్‌తో ఏకీభవించాలని అర్థం కాదు. కానీ ఈ విభేదాలు జాతికి మేలు చేకూరుస్తాయా అన్న విషయాన్ని ఆలోచించాలి’ అని వాన్స్ అన్నారు.

మస్క్ తనను అన్యాయంగా విమర్శిస్తున్నారని ట్రంప్ కాస్తంత అసహనంతో ఉన్నట్టు వాన్స్ పేర్కొన్నారు. అయినా కూడా ట్రంప్ సంయమనంతోనే వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘ఈ విషయాన్ని ఎప్పటికైనా మస్క్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా. మస్క్‌తో భారీ స్థాయిలో యుద్ధానికి దిగాలని ట్రంప్ అనుకోవట్లేదు. మస్క్ కూడా కాస్త కూల్‌గా ఉంటే అంతా అదే సర్దుకుంటుంది’ అని వాన్స్ అన్నారు.


తన మద్దతు ఎప్పుడూ ట్రంప్‌కే అని వాన్స్ స్పష్టం చేశారు. ఆయన వెంట ఉండటం తనకు ఎంతో గర్వకారణమని కూడా వ్యాఖ్యానించారు.

డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక మస్క్ ట్రంప్‌పై బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తాజా బిల్లులో ఆయన దేశీ పరిశ్రమలకు భారీగా పన్ను రాయతీలు ప్రకటించడం మస్క్‌కు అస్సలు నచ్చలేదు. ఈ చర్యతో డోజ్ సాధించిన విజయాలన్నీ నిరర్ధకంగా మారతాయంటూ మస్క్ ట్రంప్‌పై బహిరంగ విమర్శలకు దిగారు.

Updated Date - Jun 07 , 2025 | 11:59 PM