ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi-Trump Friendship Remarks: ట్రంప్ ‘ఫ్రెండ్స్’ కామెంట్స్‌పై స్పందించిన మోదీ.. ఎక్స్ వేదికగా రిప్లై

ABN, Publish Date - Sep 06 , 2025 | 03:14 PM

మోదీ తనకెప్పటికీ ఫ్రెండేనన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్‌పై భారత ప్రధాని తాజాగా స్పందించారు. తనదీ ఇదే భావన అని అన్నారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, అభివృద్ధికారక భాగస్వామ్యం ఉందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Modi Trump Friendship Remark

ఇంటర్నెట్ డెస్క్: కొంతకాలంగా భారత్‌పై గుర్రుగా ఉన్న అమెరికా ప్రభుత్వం తీరులో స్పష్టమైన మార్పు మొదలైంది. మోదీ తనకెప్పటికీ స్నేహితుడే అంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్, అమెరికాలది ప్రత్యేకమైన బంధం అని కూడా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనదీ ఇదే భావన అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారత్, అమెరికా మధ్య సమగ్ర అభివృద్ధికారక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు (Modi Trump Friendship Remark).

భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించిన అమెరికా ప్రభుత్వం ఆ తరువాత పలుమార్లు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్‌నకు సన్నిహితంగా ఉండే పలువురు నేతలు కూడా తమ నోటికి పని చెప్పారు. భారత్ మాత్రం హుందాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక మౌనం పాటించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చైనాలో జరిగిన షాంఘాయ్ సహకార సదస్సుకు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలివిడిగా మాట్లాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పాశ్చాత్య ఆధిపత్యాన్ని ధిక్కరించే ప్రత్యామ్నాయ కూటమి పురుడు పోసుకుంటోందన్న కామెంట్స్ వినిపించాయి.

ఈ క్రమంలో ట్రంప్ మరోసారి స్పందిస్తూ సంచలన కామెంట్ చేశారు. భారత్, రష్యాలను అమెరికా చైనాకు కోల్పోయిందని అన్నారు. వారి భవిష్యత్తు చక్కగా ఉండాలని అభిలషిస్తున్నట్టు కామెంట్ చేశారు. ఆ తరువాత తన కామెంట్స్‌పై ట్రంప్ మరింత వివరణ ఇచ్చారు. తాము భారత్‌ను దూరం చేసుకున్నట్టు భావించట్లేదని అన్నారు. భారీ స్థాయిలో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడమే తనకు అసంతృప్తి కలిగించిందని, ఈ విషయాన్ని మాత్రమే చెప్పానని అన్నారు. ప్రధాని మోదీకి, తనకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఇక శుక్రవారం నాడు ఈ అంశంపై ట్రంప్ మరోసారి శ్వేత సౌధంలో మాట్లాడారు. మోదీ, తానూ ఎప్పటికీ స్నేహితులమేనని స్పష్టం చేశారు. మోదీ గొప్ప ప్రధాని అని ప్రశంసించారు. భారత్, అమెరికాల బంధం ప్రత్యేకమైనదని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదని భరోసా ఇచ్చారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కూడా సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సానుకూల కామెంట్స్ చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడినట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

మోదీ గొప్ప నేత.. కానీ, ఆయన చేస్తున్నది నచ్చడం లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2025 | 05:08 PM