PM Modi: బంగ్లా అక్రమ వలసదారులు అసోంలోస్థిరపడడానికి కాంగ్రెస్ సాయం
ABN, Publish Date - Dec 22 , 2025 | 04:45 AM
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అసోంలో స్థిరపడేందుకు సాయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ చర్యలకు పాల్పడుతోంద...
గువాహటి, డిసెంబరు 21: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అసోంలో స్థిరపడేందుకు సాయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ చర్యలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని, స్థానిక ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోదని విమర్శించారు. రెండ్రోజుల అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దిబ్రూగఢ్ జిల్లా నమ్‌రూ్‌పలో రూ.10,601 కోట్లతో నిర్మించతలపెట్టిన ఎరువుల కర్మాగారానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అసోంతో పాటు యావత్ ఈశాన్య ప్రాంతానికి ఇది చరిత్రాత్మకమైన రోజని అన్నారు. నమ్‌రూప్ ఎరువుల కేంద్రంతో స్థానికులకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ కర్మాగారంలో ఏటా 12.7 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందన్నారు. ఇక్కడ 2030 కల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం గువాహటిలో బ్రహ్మపుత్ర నదిలో విహార నౌకలో మోదీ విద్యార్థులతో మాట్లాడారు. అసోంలోని వేర్వేరు పాఠశాలలకు చెందిన 25 మంది విద్యార్థులతో మోదీ నౌకలో ప్రయాణిస్తూ ‘పరీక్షా పే చర్చ’లో భాగంగా ముచ్చటించారు.
Updated Date - Dec 22 , 2025 | 04:45 AM