ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mexico Shopping Mall Explosion: మెక్సికో షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

ABN, Publish Date - Nov 02 , 2025 | 11:26 AM

మెక్సికోలోని సొనోరా రాష్ట్రంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది దుర్మరణం చెందారు.

Mexico Mall Explosion

ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోలోని ఓ షాపింగ్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించడంతో ఏకంగా 23 మంది మృత్యువాత పడ్డారు. సొనోరా రాష్ట్రంలోని హెర్మొసిల్లో ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది (Mexico Shopping Complex Explosion).

పేలుడు కారణంగా చెలరేగిన మంటల్లో భవనం దగ్ధమైపోయింది. సమీపంలోని కారు మంటలకు ఆహుతైంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం విచారకరమని సొనోరా గవర్నర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ప్రమాదంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండేందుకు కేంద్ర బృందాన్ని సొనోరాకు పంపించినట్టు కూడా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడికి సారీ చెప్పా.. కెనడా ప్రధాని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 02 , 2025 | 12:16 PM