Mark Zuckerberg: మెటా కోడింగ్ అంతా ఏఐతోనే
ABN, Publish Date - May 02 , 2025 | 04:03 AM
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకారం, వచ్చే 12 నుండి 18 నెలల్లో మొత్తం కోడింగ్‌ను ఏఐ చేయగలదు. ఏఐ బగ్స్‌ను గుర్తించడంతో పాటు తన పని తానే మెరుగుపరుచుకుంటూ టాప్ కోడర్స్ కంటే మిన్నగా మారనుందని తెలిపారు.
12-18 నెలల్లో ఇది సాధ్యం: జుకర్‌బర్గ్
న్యూఢిల్లీ, మే 1: వచ్చే 12 నుంచి 18 నెలల్లో తమ సంస్థ కోడింగ్ అంతా కృత్రిమ మేధే(ఏఐ) రాసేస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఏఐకి లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టెస్టులు నిర్వహించగలదని, బగ్స్‌ను కనిపెట్టగలదని తెలిపారు. తన పనితీరును తానే మెరుగుపరుచుకోగలదని అన్నారు. సిబ్బంది బృందంలో చక్కగా పనిచేసే వారి తరహాలోనే ఏఐ పనిచేస్తుందని.. త్వరలోనే టాప్ కోడర్స్ కంటే ఏఐ మెరుగు అవుతుందని వివరించారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 04:05 AM