Israel Hamas Conflict: సిన్వర్‌ను చంపడానికి 30సెకన్లలో 50 బాంబులు
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:08 AM
హమాస్ అగ్రనేత ముహమ్మద్ సిన్వర్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ గాజాలో భారీ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో సిన్వర్‌తో పాటు పలువురు హమాస్ కమాండర్లు మృతిచెందగా, దక్షిణ గాజాలో జరిగిన కాల్పుల్లో 31 మంది పౌరులు మరణించారు.
వైమానిక దాడుల 3డీ వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
గాజా, జూన్ 1: హమాస్ అగ్రనేత ముహమ్మద్ సిన్వర్‌ను హతమార్చడానికి ఇజ్రాయెట్ భారీ ప్రణాళిక రచించింది. గాజాలోని ఖాన్ యూని్‌సలో ఉన్న యూరోపియన్ ఆస్పత్రి కింద రహస్యంగా ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని గత నెల 13న వైమానిక దాడులు చేసింది. ఈ సెంటర్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కేవలం 30 సెకన్లలో 50కి పైగా బాంబులను జారవిడిచాయి. ఈ దాడుల్లో సిన్వర్‌తో పాటు రఫా బ్రిగేడ్ కమాండర్ ముహమ్మద్ షబానా కూడా మృతిచెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన 3డీ వీడియోను ఇజ్రాయెల్ మిలటరీ తాజాగా విడుదల చేసింది. ఇదిలా ఉండగా, దక్షిణ గాజాలో ఏర్పాటు చేసిన సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ దళాలు ఆదివారం కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 31 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా, 170 మందికి పైగా గాయపడ్డారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:08 AM