Drone Strike On Trump: ట్రంప్‌ను టార్గెట్ చేసిన ఇరాన్.. మర్డర్ ప్లాన్ రెడీ చేసేసింది..!
ABN, Publish Date - Jul 10 , 2025 | 06:57 AM
Drone Strike on Trump: ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తి మద్దతు ఇచ్చారు. అంతేకాదు.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్‌తో దాడులు చేయించారు. యుద్ధం సమయంలోనే సుప్రీం లీడర్‌ను చంపడానికి ట్రంప్, నెతన్యాహూ కుట్ర చేశారని ఇరాన్ భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ ఓ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి జావెద్ లారీజానీ ఆ ప్లాన్ ఏంటో మీడియాకు వెల్లడించారు. ట్రంప్‌ను చంపడానికి ప్రయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఆయనపై డ్రోన్ దాడి చేస్తామని చెప్పారు. జావెద్ లారీజానీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ట్రంప్ సన్ బాతింగ్ చేస్తున్నప్పుడు.. ఓ చిన్న డ్రోన్ అతడి నాభిని తాకుతుంది. అంతే..’ అని అన్నారు.
ట్రంప్ హత్య కోసం విరాళాలు..
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని బెదిరించిన ట్రంప్‌పై ఇరానియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌ను చంపి పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ‘బ్లడ్ ప్యాక్ట్’ పేరిట ఈ విరాళాల సేకరణ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందన వస్తోంది. విరాళాలు సేకరిస్తున్న ప్లాట్ ఫామ్ 100 మిలియన్ డాలర్ల లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటికే 40 మిలియన్ డాలర్ల డబ్బులు వచ్చాయి.
సుప్రీం లీడర్‌ను చంపడానికి కుట్ర చేశారని..
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయటంతో యుద్ధం మొదలైంది. రెండు దేశాలు డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. అంతేకాదు.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్‌తో దాడులు చేయించారు. యుద్ధం సమయంలోనే సుప్రీం లీడర్‌ను చంపడానికి ట్రంప్, నెతన్యాహూ కుట్ర చేశారని ఇరాన్ భావిస్తోంది. అందుకే ఆ ఇద్దరినీ చంపాలని అనుకుంటోంది.
ఇవి కూడా చదవండి
ఏపీలో 1,800 కోట్ల పెట్టుబడితో పీసీబీ యూనిట్
Updated Date - Jul 10 , 2025 | 01:06 PM