Israel Iran War: ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్.. అమెరికా మిలటరీ బేస్‌లపై దాడులు..
ABN, Publish Date - Jun 23 , 2025 | 07:55 PM
Israel Iran War: అమెరికా తన పూర్తి మద్దతు ఇజ్రాయెల్‌కు ప్రకటించింది. ఇరాన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఆదివారం నాడు అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా మిలటరీ బేస్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి చేసినట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సమయంలో సిరియాలోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇరాన్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఈ దాడిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప నిజానిజాలు ఎంటో తెలీదు.
ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడులు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. సోమవారం మధ్యాహ్నం టెహ్రాన్ సిటీపై ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడులు చేసింది. రక్షణ సంస్థలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్‌కు సంబంధించిన రక్షణ సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్, పోలీస్ ఇంటెలిజెన్స్ యూనిట్స్‌పై దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
న్యూక్లియర్ సైట్లే ప్రధాన లక్ష్యం
ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇరాన్‌కు సంబంధించిన న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకునే దాడులు మొదలెట్టాయి. మొదటగా.. 10 రోజుల కిందట ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అప్పటినుంచే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అమెరికా తన పూర్తి మద్దతు ఇజ్రాయెల్‌కు ప్రకటించింది. ఇరాన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మగాళ్లను టార్గెట్ చేసి.. తల్లీకూతుళ్ల మోసం..
ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఆకాశాన్ని అంటిన పొగ..
Updated Date - Jun 23 , 2025 | 08:44 PM