ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IndiGo Airlines: చుక్కలు చూపిస్తున్న ఇండిగో

ABN, Publish Date - Dec 07 , 2025 | 04:59 AM

ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు వాటిని రద్దు చేసుకుంటున్నారు.

  • టికెట్లు రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు

  • ముంబై విమానం రద్దు

  • హైదరాబాద్‌ ఫ్లైట్‌4 గంటలు ఆలస్యం

  • అదేబాటలో మరికొన్ని.. ఆకాశంలో టికెట్ల ధరలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు వాటిని రద్దు చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన సుమారు 400 మంది శుక్ర, శనివారాల్లో తమ టికెట్లను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రావాల్సిన ముంబై విమానం రద్దయింది. హైదరాబాద్‌ నుంచి రావాల్సిన విమానం శనివారం నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై విమానాల రాకపోకల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

తిరుపతిలో ప్రయాణికుల ఆందోళన

తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వచ్చి, అనంతరం విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో విమానం అర్ధరాత్రి దాటినా రాకపోవడంతో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో వారందరికీ ప్రత్యేక బస ఏర్పాటు చేసి శనివారం ఉదయం వచ్చిన ఇండిగో విమానంలో విశాఖపట్నానికి తరలించారు. అలాగే హైదరాబాద్‌, బెంగళూరు నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాయి. హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఎయిర్‌ అలయన్స్‌, శివమొగ్గ నుంచి రావాల్సిన స్టార్‌ ఎయిర్‌ విమానాలు కూడా 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చాయి.

ఢిల్లీ-విశాఖ టికెట్‌ ధర రూ.లక్ష

ఇండిగో విమానయాన సంస్థలో ఏర్పడిన సంక్షోభంతో దేశవ్యాప్తంగా వందలాది సర్వీసులు రద్దయిపోతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో శనివారం తొమ్మిది ఇండిగో సర్వీసులు ఆగిపోయాయి. అందుబాటులో ఉన్న ఇతర విమానాల్లో గమ్య స్థానాలకు చేరడానికి ప్రయాణికులు ప్రయత్నిస్తుండటంతో ఆయా సంస్థలు టికెట్ల ధరలు భారీగా పెంచేశాయి. భారత్‌, దక్షిణాఫ్రికా చివరి వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ విశాఖలో నిర్వహించడంతోనూ ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి టికెట్‌ ధర గరిష్ఠంగా రూ1,00,602కు చేరింది. చెన్నై నుంచి విశాఖకు రూ.49,033, హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.33,769 వరకు వసూలు చేశారు. ఆదివారం కూడా టికెట్ల ధరలు అధికంగానే ఉన్నాయి.

Updated Date - Dec 07 , 2025 | 05:40 AM