Canadian Shooting: కెనడాలో భారత సంతతి పారిశ్రామికవేత్త హత్య
ABN, Publish Date - Oct 30 , 2025 | 04:10 AM
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో ఘాతుకానికి పాల్పడింది. అక్కడ భారత సంతతి పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి(68)ని సోమవారం హత్య...
గాయకుడి ఇంటిపై కాల్పులు
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఘాతుకం
న్యూఢిల్లీ, అక్టోబరు 29: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో ఘాతుకానికి పాల్పడింది. అక్కడ భారత సంతతి పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి(68)ని సోమవారం హత్య చేయడంతోపాటు పంజాబీ గాయకుడు చన్ని నట్టన్ ఇంటిపై కాల్పులు జరిపింది. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతోనే దర్శన్ సింగ్‌ని హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డి ధిల్లాన్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆయన పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఎబాట్స్‌ఫోర్డ్ వద్ద ఉన్న దర్శన్ సింగ్ ఇంటి వద్దే ఆయన్ను కాల్చి చంపారు. రోడ్డు మీద పార్కు చేసి ఉన్న తన కారులో ఎక్కిన దర్శన్‌సింగ్‌పై అప్పటికే అక్కడికి కారులో వచ్చి వేచిఉన్న ఆగంతకుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. దర్శన్‌సింగ్ కేనమ్ ఇంటర్నేషనల్ అనే పెద్ద టెక్స్‌టైల్ రీసైక్లింగ్ కంపెనీ యజమాని. 1991లో కెనడా వెళ్లిన ఆయన తొలుత చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. తర్వాత ఒక టెక్స్‌టైల్ రీసైక్లింగ్ కంపెనీని కొనుగోలు చేసి దాన్ని గ్లోబల్ కంపెనీగా తీర్చిదిద్దారు. దాతగాను పేరొందిన ఆయన హత్యపై కెనడాలోని పంజాబీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కాగా, గాయకుడు సర్దార్ ఖేరాకు దగ్గరవుతున్నందుకే నట్టన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు ధిల్లాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Updated Date - Oct 30 , 2025 | 04:10 AM