Trump Aide: రష్యా చమురును భారత్ అమ్మిపెడుతోంది
ABN, Publish Date - Aug 19 , 2025 | 02:29 AM
రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుని.. దాన్ని అధిక విలువగల ఉత్పత్తులుగా మార్చి ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం రష్యాకు క్లియరింగ్ హౌస్‌లా వ్యవహరిస్తోందని..
భారత్‌పై ట్రంప్ సలహాదారు నవరో అక్కసు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుని.. దాన్ని అధిక విలువగల ఉత్పత్తులుగా మార్చి ప్రపంచదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం రష్యాకు క్లియరింగ్ హౌస్‌లా వ్యవహరిస్తోందని.. పుతిన్‌కు కావాల్సిన డాలర్లను ఇస్తోందని.. ట్రంప్ సలహాదారు పీటర్ నవరో మండిపడ్డారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలన్న అంతర్జాతీయ ప్రయత్నాలకు భారత్ గండికొడుతోందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు రాసిన వ్యాసంలో ధ్వజమెత్తారు. తాము వద్దంటున్నా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం.. వాణిజ్య ఒప్పందం విషయంలోనూ గట్టిగా వ్యవహరిస్తుండడంపై ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. భారతదేశం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి కావాలనుకుంటే.. అలా ప్రవర్తించాలని సుద్దులు చెప్పారు.
Updated Date - Aug 19 , 2025 | 02:29 AM