Attacks on Minorities in Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీల పై దాడులను రాజకీయ హింసగా చూడలేం
ABN, Publish Date - Dec 27 , 2025 | 03:47 AM
బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులు, బౌద్ధులు, క్రిష్టియన్లపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకరమని భారత్ పేర్కొంది...
న్యూఢిల్లీ, డిసెంబరు 26: బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులు, బౌద్ధులు, క్రిష్టియన్లపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకరమని భారత్ పేర్కొంది. వీటిని రాజకీయ హింసలో భాగమని సరిపెట్టుకోలేమని భారత విదేశాంగ శాఖప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు మైనార్టీలపై 2,900 దాడులు జరిగాయని తెలిపారు. హిందూ యువకులు దీపు చంద్రదాస్, అమృత్ మొండల్‌లను మూకదాడిలో చంపేయటంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. వారి హత్యకు కారణమైన నిందితులను యూనస్ ప్రభుత్వం కఠినంగా శిక్షింస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు భారత వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.
Updated Date - Dec 27 , 2025 | 03:49 AM