Bangladesh incident: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:11 AM
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. మైమెన్‌సింగ్ జిల్లాలోని సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది..
రెండు వారాల్లో ఇది మూడో ఘటన
ఢాకా, డిసెంబరు 30: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. మైమెన్‌సింగ్ జిల్లాలోని సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కంపెనీ ఆవరణలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని.. నోమన్ మియా అనే పేరున్న మరో గార్డు తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బజేంద్ర.. ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు. బజేంద్ర, నోమన్‌లిద్దరూ బంగ్లాదేశ్ భద్రతాదళమైన అన్సార్ సభ్యులే. అన్సార్‌లో సభ్యులుగా ఉన్న వారికి ప్రభుత్వమే శిక్షణ అందించి, ఆయుధాలు ఇచ్చి, అవసరమైన చోట గార్డులుగా వారి సేవలు ఉపయోగించుకుంటుంది. కాగా, జరిగిన ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రత్యక్షసాక్షుల ప్రకారం బజేంద్ర, నోమన్‌మియా మధ్య ఎటువంటి వాగ్వాదంగానీ, ఘర్షణగానీ చోటు చేసుకోలేదని తెలిపారు. నోమన్‌మియా బజేంద్రతో సరదాగా మాట్లాడుతూ, తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి ‘కాల్చనా?’ అని అడిగాడని, తదుపరి క్షణంలో బుల్లెట్ దూసుకొచ్చి బజేంద్ర ఎడమ తొడకు గాయమైందని వెల్లడించారు. అక్కడ ఉన్న వాళ్లు బజేంద్రను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా, ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరిచే దిశగా బంగ్లాదేశ్ మతఛాందసవాదులతో సంబంధాలు పెట్టుకున్న 11మందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు
Updated Date - Dec 31 , 2025 | 04:11 AM