ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Henley Passport Index: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. భారత్ ర్యాంకు ఎంతంటే..

ABN, Publish Date - Oct 16 , 2025 | 09:32 AM

ఈసారి హెన్లీపాస్ పోర్డు ఇండెక్స్‌లో భారత్ 5 స్థానాల మేర దిగజారి 85 ర్యాంకుకు పరిమితమైంది. అమెరికాకు టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. తొలిసారిగా 12వ స్థానానికి పరిమితమైంది.

Henley Passport Index 2025

ఇంటర్నెట్ డెస్క్: శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితా హెన్లీ పాస్‌పోర్డు ఇండెక్స్‌లో (Henley Passport Index) ఈసారి భారత్ ఏకంగా 5 స్థానాల మేర దిగజారింది. భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండటంతో 85 ర్యాంకుకు పరిమితమైంది. గతేడాది 62 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉండటంతో భారత్ 80 స్థానంలో నిలిచింది (India at 85th Rank).

ప్రస్తుతం 193 దేశాల్లో వీసా రహిత ఎంట్రీ సదుపాయం ఉన్న సింగపూర్ (Singapore) ఈ ఏడాది కూడా పాస్‌పోర్టు ఇండెక్స్‌ జాబితాలో టాప్‌లో నిలిచింది. దక్షిణ కొరియా (192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ) రెండో స్థానాన్ని దక్కించుకుంది (South Korea). జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్‌లాండ్ దేశాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 188 దేశాలకు ముందుగా వీసా తీసుకోకుండానే వెళ్లొచ్చు. ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, డెన్‌మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, ఐర్‌ల్యాండ్ దేశాల నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. హంగరీ, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడెన్ దేశాలు ఆరవ ర్యాంకును దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, జెక్ రిపబ్లిక్, మాల్టా, పోలాండ్ దేశాలు 7 స్థానంలో ఉన్నాయి. 8వ స్థానంలో క్రొయేషియా, ఎస్టోనియా, స్లోవేకియా, స్లొవేనియా, యూఏఈ, యూకే దేశాల పాస్‌పోర్టులతో 183 దేశాలకు ముందస్తు వీసా లేకుండాలే వెళ్లొచ్చు. తొమ్మిదవ స్థానంలో కెనడా, పదవ స్థానంలో లాట్వీయా, లీసెస్టైన్ దేశాలు ఉన్నాయి. ఇక చైనా ఈసారి 64వ స్థానంలో నిలిచింది. గత పదేళ్లల్లో చైనా 30 స్థానాల మేర ఎగబాకింది.

టాప్ టెన్‌లో అమెరికాకు దక్కని చోటు..

అగ్రరాజ్యం అమెరికాకు (USA at 12th Place) కనీసం తొలి పది స్థానాల్లో కూడా చోటు దక్కలేదు. 180 దేశాలు అమెరికన్లకు వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతిస్తుండటంతో అగ్రరాజ్యం 12వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమెరికా ర్యాంకు ఇంతలా పతనం అవ్వడం ఇదే తొలిసారి. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అమెరికా స్థానాన్ని దిగజార్చాయి. గతంలో అమెరికా పాస్‌పోర్టు ఉన్న వారికి వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయం ఇచ్చిన బ్రెజిల్ ఈ ఏప్రిల్‌లో ఉపసంహరించుకుంది. ఈ ఏడాది పలు దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ చాన్స్ ఇచ్చిన చైనా కూడా అమెరికాను దూరం పెట్టింది. మయాన్మార్, సోమాలియా దేశాల ఈ-వీసా నిబంధనల్లో మార్పులు కూడా అమెరికా పాస్‌పోర్టు ర్యాకింగ్‌పై ప్రభావం చూపించాయి.

భారత్ పొరుగు దేశమైన పాక్ 103వ స్థానంలో, బంగ్లాదేశ్ 100 స్థానంలో ఉన్నాయి. నేపాల్‌ 101వ స్థానంలో, భూటాన్‌ 92వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో చిట్టచివరన అప్ఘానిస్థాన్ నిలిచింది. అప్ఘాన్ కంటే మెరుగైన స్థానంలో సిరియా, ఇరాక్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

రష్యా చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

టైమ్‌ మ్యాగజైన్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 10:14 AM