ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H-1B Visa Interviews: హెచ్‌-1బీ ఇంటర్వ్యూలు అక్టోబరుకు వాయిదా!

ABN, Publish Date - Dec 19 , 2025 | 03:54 AM

హెచ్‌-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది భారతీయ దరఖాస్తుదారులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు....

  • సోషల్‌ మీడియా ఖాతాల వెట్టింగ్‌తో మరింత జాప్యం

న్యూఢిల్లీ, డిసెంబరు 18: హెచ్‌-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది భారతీయ దరఖాస్తుదారులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. వీరి వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్‌మెంట్‌ గడువును అమెరికా వచ్చే ఏడాది అక్టోబరుకు పొడిగించింది. వాస్తవానికి డిసెంబరు, జనవరి నెలల్లో జరగాల్సిన హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల ఇంటర్వ్యూలను ఫిబ్రవరి, మార్చి నెలలకు రీషెడ్యూల్‌ చేసినట్లు ఇటీవల పలువురు దరఖాస్తుదారులకు అమెరికా దౌత్య కార్యాలయం అధికారులు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అక్టోబరుకు వాయిదా వేశారని చెబుతున్నారు. దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను జల్లెడ పట్టడానికి అదనపు సమయం పడుతుండటమే దీనికి కారణమని ఇమిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలతో అంతర్జాతీయ ప్రయాణాల కోసం టికెట్లు బుక్‌ చేసుకున్న వారితో పాటు వీసా స్టాంపింగ్‌ కోసం భారత్‌కు తిరిగొచ్చిన వందలాది మంది తమ వీసా ఇంటర్వ్యూలు పదేపదే వాయిదా పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రస్తుతం భారత్‌లో ఉండి వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాయిదా పడినవారు ముందు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవాలని ఇమిగ్రేషన్‌ నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల నుంచి లాంగ్‌ లీవ్‌ తీసుకోవడం లేదా ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు.

Updated Date - Dec 19 , 2025 | 03:54 AM