Georgia Meteorite Fragment: జార్జియాలో పడిన ఉల్కా శకలం 456 కోట్ల ఏళ్లనాటిది
ABN, Publish Date - Aug 11 , 2025 | 03:32 AM
టీవల అమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క.. భూమి కంటే 2 కోట్ల ఏళ్ల పురాతనమైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు
అట్లాంటా, ఆగస్టు 10: ఇటీవల అమెరికాలోని జార్జియాలో పడిన ఉల్క.. భూమి కంటే 2 కోట్ల ఏళ్ల పురాతనమైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు. జూన్ 26న దూసుకొచ్చిన ఆ ఉల్కా శకలం హెన్రీ కౌంటీలోని మెక్‌డొనౌగ్‌లో ఓ ఇంటి పైకప్పును తాకింది. ‘రూఫ్ ఇన్సులేషన్’ను ఛేదించుకుని లోపలికి వచ్చిన దాని ధాటికి నేలపై చిన్న గుంత పడింది. అది 23 గ్రాములే ఉన్నా సూపర్ సోనిక్ వేగంతో భూమిపై దూసుకొస్తున్నప్పుడు వచ్చిన శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకూ వినిపించింది.
Updated Date - Aug 11 , 2025 | 03:32 AM