ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H1B Visa: హెచ్‌1బీ వీసాలకు కాలం చెల్లనుందా?.. ట్రంప్ సన్నిహితుడి సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Aug 04 , 2025 | 10:46 AM

అమెరికా నుంచి విదేశీ విద్యార్థులను వెంటనే బయటకు పంపించాలని వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు స్టీవ్ బానన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు దేశంలో ఉండకూడదని, గ్రాడ్యుయేషన్ తర్వాత వారిని తప్పనిసరిగా స్వదేశాలకు పంపించాలని సూచించారు.

H1HB Visa

అమెరికా (America) నుంచి విదేశీ విద్యార్థులను (Foreign Students) వెంటనే బయటకు పంపించాలని వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు స్టీవ్ బానన్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు దేశంలో ఉండకూడదని, గ్రాడ్యుయేషన్ తర్వాత వారు తప్పనిసరిగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. విదేశీ గ్రాడ్యుయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు హెచ్‌1బీ వీసాలను (H‑1B Holders) స్పాన్సర్‌ చేస్తాయి.

విదేశీ విద్యార్థులను తమ సంస్థల్లో నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ ఈ హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. ఈ వీసాలపై కొన్ని లక్షల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. 2024లో అమెరికా సుమారు 40 వేల హెచ్‌1బీ వీసాలను జారీ చేసింది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే వీటిలో అధిక భాగం ఇప్పటికే ఉన్న వీసాల గడువును పొడిగించినవి. కొత్త వీసాలను జారీ చేయడం చాలా వరకు తగ్గిపోయింది. హెచ్‌1బీ వీసా హోల్డర్లలో చాలామంది అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రధాన సాంకేతిక సంస్థలలో పనిచేస్తున్నారు.

తాజాగా బానన్ వ్యాఖ్యలు హెచ్‌1బీ వీసాదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బానన్ ప్రస్తుతం ప్రభుత్వ అధికారి కాదు. అయితే, అతను రాజకీయ, విధాన నిర్ణయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలను బహిరంగంగా సమర్థిస్తుంటాడు. బానన్ వ్యాఖ్యలు ఇప్పటికే హెచ్‌1బీ వీసాలు కలిగి ఉన్న వారిని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 11:06 AM