ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H 1B Visa Holders: హెచ్‌ 1బీ వీసా ఉన్నా ప్లాన్‌ బీ అవసరం!

ABN, Publish Date - Nov 25 , 2025 | 03:55 AM

అమెరికాకు వెళ్లే విదేశీయులకు హెచ్‌ 1బీ వీసా అంటే ఒక భరోసా!. ఈ వీసా దొరికితే చాలు తమను ఎవరూ కదిలించలేరని భావిస్తారు....

న్యూఢిల్లీ, నవంబరు 24: అమెరికాకు వెళ్లే విదేశీయులకు హెచ్‌-1బీ వీసా అంటే ఒక భరోసా!. ఈ వీసా దొరికితే చాలు తమను ఎవరూ కదిలించలేరని భావిస్తారు. కానీ, అలాంటి భరోసా ఏమీ లేదని, అందువల్ల ప్లాన్‌-బీతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాన్‌-బీలో నాలుగు అంశాలను వారు పేర్కొంటున్నారు. హెచ్‌-1బీ వీసా ద్వారా పొందిన ఉద్యోగం కోల్పోయిన వారు.. వెంటనే బీ-2 పర్యాటక వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా అమెరికాలో కొన్నాళ్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్‌-1 విద్యార్థి వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా వేరే ప్రోగ్రాం చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ సమయం లభిస్తుంది. అదేవిధంగా హెచ్‌-4 వీసా(డిపెండెంట్‌)కు మరలే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఎవరికి హెచ్‌-1బీ వీసా ఉన్నా.. రెండో వ్యక్తి హెచ్‌-4కు దరఖాస్తు చేసుకుంటే.. ఉద్యోగం సంపాదించుకునే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. అదేసమయంలో దేశాన్ని వీడి వెళ్లే పరిస్థితి నుంచి కూడా తప్పించుకోవచ్చు.

Updated Date - Nov 25 , 2025 | 03:56 AM