ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: పాక్ కుక్కలా భయపడింది.. అందుకే రాజీకి వచ్చింది

ABN, Publish Date - May 15 , 2025 | 12:50 PM

Ex US Official On Ceasefire: డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న ప్రచారంపై అమెరికా, పెంటగాన్‌కు చెందిన మాజీ అధికారి దారుణమైన కామెంట్లు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను పిచ్చివాడిగా.. పాకిస్తాన్‌ను కుక్కగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Ex US Official On Ceasefire

ఇండియా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం మొదలైన మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. భారత్ కొట్టిన దెబ్బకు పాక్ కూసాలు కదిలిపోయాయి. మిస్సైల్స్, డ్రోన్ల దాడి కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. ఒకరకంగా పాక్‌పై కోలుకోలేని దెబ్బపడింది. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశం సర్వ నాశనం అవుతుందని పాక్ భావించింది. వెంటనే కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాయంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ధం ఆగిపోయింది. యుద్ధాన్ని తానే ఆపానని ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు.


మరో వైపు పాకిస్తాన్ తామే యుద్ధంలో గెలిచామని ప్రచారం చేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న ప్రచారంపై అమెరికాలోని పెంటగాన్‌కు చెందిన మాజీ అధికారి దారుణమైన కామెంట్లు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ను పిచ్చివాడిగా.. పాకిస్తాన్‌ను కుక్కగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ ఇండియా దెబ్బకు తోకుముడిచిన కుక్కలా అయింది. కాల్పుల విరమణ కోసం పరుగులు తీసింది. యుద్ధంలో పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింది. ఇండియా డిప్లమేటిక్‌గా..


మిలటరీ పరంగా విజయం సాధించింది. ఇండియా ఎందుకు విజయం సాధించిందని అంటున్నానంటే.. ఇప్పుడు అందరి చూపు.. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న విషయం వైపే ఉంది. టెర్రరిస్టులు చనిపోయినపుడు ఆర్మీ అధికారులు యూనిఫామ్‌లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంటే దానర్థం.. అక్కడి టెర్రరిస్టులకు.. ఆర్మీ వాళ్లకు తేడా లేదని. చరిత్ర గురించి బాగా తెలిసిన వాడిగా చెబుతున్నాను. ఇండియాతో యుద్ధం చేసి ఓడిపోయిన ప్రతీ సారి తామే గెలిచామని పాకిస్తాన్ జబ్బలు చరుచుకుంటోంది. పాకిస్తాన్ తన సొంత ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Michael Rubin: భారతీయులు ట్రంప్‌ మాటల్ని సీరియస్‌గా తీసుకోకండి.. అమెరికా మాజీ అధికారి..

Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..

Updated Date - May 15 , 2025 | 01:08 PM