ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Michael Rubin: భారతీయులు ట్రంప్‌ మాటల్ని సీరియస్‌గా తీసుకోకండి.. అమెరికా మాజీ అధికారి..

ABN, Publish Date - May 15 , 2025 | 11:57 AM

Ex US Official Michael Rubin: పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్రంప్‌ ఓ కామెడీ పీస్ అని అన్నారు. భారతీయులు అతడ్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Ex US Official Michael Rubin

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశానికి చెందిన మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన కామెంట్లు చేశారు. ట్రంప్‌ ఓ కామెడీ పీస్ అని, భారతీయులు అతడ్ని పట్టించుకోవాల్సిన పని లేదని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్‌లు కలిసి భోజనం కూడా చేయాలని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రచారంపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ మాట్లాడుతూ.. ‘ ప్రతీ దానికి తానే కారణమని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు.


మీరు గనుక ట్రంప్‌ను అడిగితే.. ఒంటి చేత్తో వరల్డ్ కప్ సాధించానంటాడు. ఇంటర్‌నెట్‌ను కనిపెట్టింది తానేనంటాడు. క్యాన్సర్‌ను నయం చేసింది కూడా తానేనంటాడు. ఈ విషయంలో భారతీయులది కూడా అమెరికన్ల పరిస్థితే. భారతీయులు ట్రంప్‌ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. పాకిస్తాన్ మీద కూడా ఆయన విమర్శనాత్మక కామెంట్లు చేశారు. పాకిస్తాన్‌ను కుక్కతో పోల్చారు. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిన కుక్కలా పారిపోయిందని అన్నారు.


యుద్ధాన్ని ఆపాము.. లేదంటే ఘోరం జరిగేది

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ఆగిపోవటంలో తన పాత్ర ఎంతో ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రతీ చోటా చెప్పుకుని తిరుగుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా యుద్ధం గురించే మాట్లాడుతున్నారు. ‘ మేము అణుయుద్ధాన్ని ఆపాము. లేదంటే అదో దారుణమైన అణు యుద్ధం అయి ఉండేది. యుద్ధం కారణంగా లక్షల మంది ప్రాణాలు పోయి ఉండేవి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబిన్‌లకు నా కృతజ్ణతలు.

గత శనివారం నా కారణంగానే రెండు దేశాల మధ్య యుద్ధం వెంటనే ఆగిపోయింది. రెండు దేశాల దగ్గర చాలా అణు బాంబులు ఉన్నాయి. రెండు దేశాలు యుద్ధం ఆపడానికి మేము ఎంతో సాయం చేశాము. వ్యాపార పరంగా కూడా సాయం చేస్తున్నాము. యుద్దం ఆపితేనే వ్యాపారం చేస్తామని చెప్పాము. లేదంటే వ్యాపారం చేయము అని స్పష్టం చేశాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Kafi Success Story: యాసిడ్ దాడిలో కళ్లు పోయాయి.. అయినా విజయం సాధించింది..

Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..

Updated Date - May 15 , 2025 | 01:29 PM