Europes Population Crisis: యూరప్‌ను భయపెడుతున్న జనాభా తగ్గుదల.. 2100 నాటికి దారుణ పరిస్థితి..
ABN, Publish Date - Nov 21 , 2025 | 11:37 AM
యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా కూడా దేశాలు నాశనం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
జనాభా తగ్గుదల యూరప్ దేశాలను భయపెడుతోంది. రికార్డు స్థాయిలో యూరప్ దేశాల్లోని జనాభా శాతం కిందకుపడిపోయింది. మొత్తం అన్ని యూరప్ దేశాల్లో కలిపి 2024లో కేవలం 318,005 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. 1941 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో పిల్లలు పుట్టడం ఇదే మొదటి సారి. ఫెర్టిలిటీ రేటు 1.10 శాతానికి పడిపోయింది. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఆడవారే. యూరప్ దేశాల్లోని ఆడవారు పెళ్లిళ్లు చేసుకోవటం ఆలస్యం చేస్తున్నారు. పిల్లల్ని కూడా లేటుగా కంటున్నారు.
కాస్ట్ ఆఫ్ లివింగ్, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఆడవారు పెళ్లిళ్లు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. ఇటలీతో పాటు పోలాండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యువకుల జనాభా తగ్గుతుంటే వృద్ధుల జనాభా పెరుగుతూ పోతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం పడుతోంది. ఇటలీ, పోలాండ్, స్పెయిన్ దేశాల్లో మరణాలు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో యూరప్ దేశాలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి సగం యూరప్ జనాభా మటుమాయం అవుతుందని అంటున్నారు.
నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగానే యూరప్ దేశాల్లోని చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. మిగిలిన గ్రామాల్లోని యువకులు పట్టణాలకు వలస వెళుతున్నారు. గత పదేళ్లలో నేటివ్ బర్త్ రేట్స్ 25.6 శాతం తగ్గిపోయాయి. 33 ఏళ్ల వయసులో ఎక్కువ మంది ఆడవాళ్లు పిల్లల్ని కంటున్నారు. అది కూడా కేవలం ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బర్త్ రేట్లను పెంచడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతోంది. జనాభా తగ్గుదల కారణంగా యూరప్ దేశాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.
ఇవి కూడా చదవండి
విజయ్‌పై ప్రేమలత ఫైర్.. 41 మంది ప్రాణాలు పోయినా..
తానా ఆధ్వర్యంలో రైతులకు 20 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, పరజాలు పంపిణీ
Updated Date - Nov 21 , 2025 | 01:17 PM