EU Fines X Platform: ఎక్స్‌పై ఈయూ రూ.1,257 కోట్ల జరిమానా
ABN, Publish Date - Dec 06 , 2025 | 04:06 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌పై యూరోపియన్ యూనియన్ ఈయూ భారీ జరిమానా విధించింది...
లండన్, డిసెంబరు 5: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) భారీ జరిమానా విధించింది. తమ కూటమి డిజిటల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, ఎక్స్‌పై ఏకంగా 120 మిలియన్ యూరోల (సుమారు రూ.1,257 కోట్లు) ఫైన్ వేసినట్లు ఈయూ నియంత్రణాధికారులు శుక్రవారం ప్రకటించారు. ఎక్స్‌లోని కొన్ని పద్ధతులు వినియోగదారులను మోసాలకు గురిచేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ తమ రెండేళ్ల దర్యాప్తులో తేల్చింది. గతంలో ప్రముఖులకు మాత్రమే ఇచ్చే బ్లూ చెక్‌మార్క్‌లను మస్క్ కొనుగోలు తర్వాత, నెలకు కొంత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలుపెట్టిందని తెలిపింది. దీనివల్ల అసలు ఖాతాదారులెవరు? నకిలీ ఖాతాలు ఏవి? అని తెలుసుకోవడం కష్టమవుతోందన్న కమిషన్, దీన్ని మోసపూరిత పద్ధతిగా పేర్కొంది.
Updated Date - Dec 06 , 2025 | 04:06 AM