Withdrawal Rules: 100శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు
ABN, Publish Date - Oct 14 , 2025 | 04:02 AM
ఈపీఎ్‌ఫవో చందాదారులకు శుభవార్త. 7కోట్లకు పైగా పీఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్షిక......
పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సరళీకరించిన ఈపీఎ్‌ఫవో
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ఈపీఎ్‌ఫవో చందాదారులకు శుభవార్త. 7కోట్లకు పైగా పీఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన నిబంధనలు సరళీకరిస్తూ సోమవారం ఈపీఎ్‌ఫవో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నిల్వలో వంద శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యార్థం ఈపీఎఫ్ స్కీమ్‌లోని పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేయాలని సీబీటీ నిర్ణయించింది. తాజా నిర్ణయంమేరకు చందాదారులు ఉద్యోగి, యజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్‌లోని అర్హమైన బ్యాలెన్స్‌లో వంద శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈమేరకు 13 క్లిష్టమైన నిబంధనలను ఒక నిబంధనగా క్రమబద్ధీకరించింది. దీనిని మూడు రకాలుగా వర్గీకరించింది. అవి.. ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. మరోవైపు ఉపసంహరణ పరిమితులను కూడా సరళీకరించారు. విద్య కోసం ఉపసంహరణలను పదిసార్ల వరకు, వివాహం కోసం ఐదుసార్ల వరకు (ప్రస్తుతం వివాహం, విద్య కోసం ఉన్న మొత్తం మూడు పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంది) అనుమతించారు. ఇక అన్ని పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించారు. ఇంతకు ముందు ప్రత్యేక పరిస్థితుల కింద చందాదారు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ప్రకృతి విపత్తు, సంస్థల లాకౌట్లు/మూసివేతలు, నిరుద్యోగం, మహమ్మారుల విజృంభణ వంటి కారణాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు చందాదారు ఏ కారణాన్ని పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస నిల్వగా ఉంచాలన్న నిబంధన తీసుకువచ్చారు. దీంతో ఈపీఎఫ్‌వో అందించే అధిక వడ్డీ రేటు (ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ) ప్రయోజనాన్ని సభ్యులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది పదవీ విరమణ సమయానికి నిధిని కూడబెట్టుకోవడానికి దోహదపడనుంది. ఈపీఎఫ్ ముందస్తు ఫైనల్ సెటిల్‌మెంట్‌ను పొందే వ్యవధిని ప్రస్తుత 2 నెలల నుంచి 12 నెలలకు మార్చారు. అలాగే తుది పెన్షన్ ఉపసంహరణ వ్యవధిని 2 నెలల నుంచి 36 నెలలకు మార్చారు. కాగా ఈపీఎఫ్ 95 పెన్షనర్ల ఇంటి వద్దనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) సర్వీసులు అందించడానికి గాను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. కాగా. వచ్చే నెల 1నుంచి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు (డీఎల్‌సీ) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమం 30 వరకు అమలు కానుంది.
కనీస పెన్షన్ 7,500కు పెంచండి
తన సభ్యులకు నెలవారీ రూ.7,500 కనీస పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో పెన్షనర్ల సంఘం ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టింది. తూర్పు కిద్వాయ్ నగర్‌లోని ఈపీఎ్‌ఫవో కేంద్ర కార్యాలయం వెలుపల వేలాది మంది పెన్షనర్లు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నట్టు కమిటీ పేర్కొంది. రూ.7,500 కనీస పెన్షన్, పూర్తి డీఏ పునరుద్ధరణ, వైద్య ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
Updated Date - Oct 14 , 2025 | 04:02 AM