Elon Musk: ముగిసిన ట్రంప్-మస్క్ బంధం
ABN, Publish Date - May 30 , 2025 | 06:00 AM
ఫెడరల్ ప్రభుత్వ వ్యయాలను భారీగా తగ్గించడానికి ఏర్పాటైన ‘డోజ్’ చీఫ్‌గా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆ పదవి నుంచి తప్పుకొంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
డోజ్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్
ట్రంప్ బిల్లుపై వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మస్క్ వైదొలగిన వైనం
వాషింగ్టన్, మే 29: ఫెడరల్ ప్రభుత్వ వ్యయాలను భారీగా తగ్గించడానికి ఏర్పాటైన ‘డోజ్’ చీఫ్‌గా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆ పదవి నుంచి తప్పుకొంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగింపునకు వచ్చినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘ఎక్స్’లో ఆయన తెలిపారు.
అయితే, ట్రంప్ బడ్జెట్ ప్రణాళిక పట్ల మస్క్ తాజా గా తన నిరాశను ప్రకటించారు. ఈ ప్రణాళిక వల్ల పన్నుల్లో కోతల పరిమాణం పెరుగుతుందని, మిలిట రీ ఖర్చు భారీస్థాయికి చేరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఆయన తాను డోజ్’ చీఫ్ పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. దీంతో ట్రంప్-మస్క్ మఽధ్య బంధం ముగిసిపోయినట్టేనని భావిస్తున్నారు.
Updated Date - May 30 , 2025 | 06:00 AM