Earthquake In Turkey: టర్కీని వణికించిన భూకంపం.. పలు భవనాలు నేలమట్టం..
ABN, Publish Date - Aug 11 , 2025 | 08:54 AM
టర్కీని మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం సాయంత్రం బలికెసిర్ ప్రావిన్సులో భూప్రంకపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. బలికెసిర్ ప్రావిన్సులో భూకంపం సంభవించిన సమయంలో 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్‌లో కూడా భూమి కంపించింది.
టర్కీ (Turkey)ని మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం సాయంత్రం బలికెసిర్ ప్రావిన్సులో భూప్రంకపనలు (Earthquake) సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. బలికెసిర్ ప్రావిన్సులో భూకంపం సంభవించిన సమయంలో 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్‌లో కూడా భూమి కంపించింది. దీంతో ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు (Earthquake In Turkey).
భూకంపం ధాటికి సిందిర్గి పట్టణంలో దాదాపు 16 భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 29 మంది తీవ్రంగా గాయపడగా, ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు ప్రస్తుతం శిథిలాలను తొలిగించే పనిలో నిమగ్నమయ్యారు. టర్కీ తరచుగా భూకంపాలకు గురవుతుంటుంది. 2023లో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భూకంపం ధాటికి పురాతన నగరం ఆంటియోక్ సర్వనాశనమైంది.
ఇక, గత నెలలో కూడా టర్కీలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమయంలో ఒకరు మరణించగా, 69 మంది గాయపడ్డారు. ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాలు భూకంపాల బారిన పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రష్యాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సునామీ కూడా వచ్చింది. రష్యా, జపాన్ తీరాలు సునామీ ముప్పను ఎదుర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు
డాలర్ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం
For More AP News and Telugu News
Updated Date - Aug 11 , 2025 | 10:11 AM