ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:09 PM

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Donald Trump

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

వచ్చే వారం దాని గురించి తప్పకుండా మాట్లాడతాం. రెండు దేశాల మధ్య త్వరలో పెద్ద ఎత్తున ఖైదీల మార్పిడి జరుగుతుంది’ అని అన్నారు. కాగా, ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్లపై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్‌కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది.

ఇవి కూడా చదవండి

మరీ ఇంత దారుణమా.. ప్లై ఓవర్ ఓపెన్ అయి వారం కూడా కాలేదు కదరా..

టాలెంట్ చూపిస్తున్న మొసలి పిల్ల..

Updated Date - Jun 15 , 2025 | 12:14 PM