ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ బహుమతి.. ఇంకా క్లారిటీ లేదన్న ఖతార్

ABN, Publish Date - May 12 , 2025 | 07:48 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్లబోతున్నారు.

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)నకు ఖతార్ (Qatar) అత్యంత విలాసవంతమైన విమానాన్ని(luxury jet) బహుమతిగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల విలువైన, అత్యంత విలాసవంతమైన 747-8 జెంబో జెట్ విమానాన్ని ట్రంప్‌నకు బహుమతిగా ఖతార్ పాలక కుటుంబం ఇవ్వబోతున్నట్టు సమాచారం (Gift To Trump).


ఈ విలాసవంతమైన విమానాన్ని ట్రంప్ పదవీ కాలం ముగిసే సంవత్సరమైన 2029 జనవరి వరకు ఉపయోగించుకోవచ్చట. అప్పటివరకు ట్రంప్ ఈ విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌కు కొత్త వెర్షన్‌గా వినియోగిస్తారట. అందుకు తగినట్టుగా ఈ విమానానికి కొన్ని మార్పులు చేస్తారట. ట్రంప్ ఖతార్ పర్యటనలో ఈ బహుమతిని ఖతార్ పాలక కుటుంబం ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బహుమతిపై ఖతార్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.


కాగా, ఈ విలాసవంతమైన బహుమతిని ఇవ్వడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ఖతార్ ఓ ప్రకటనలో తెలిపింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఈ బహుమతిపై ప్రకటన ఉంటుందట. మరోవైపు ఇతర దేశాల నుంచి ఇంత భారీ బహుమతులను అమెరికా అధ్యక్షుడు స్వీకరంచవచ్చా, లేదా అనే విషయం గురించి, దాని చట్టబద్ధత గురించి అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 08:01 AM