Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలోనే వలసలపై ఉక్కుపాదం!
ABN, Publish Date - Jan 21 , 2025 | 01:36 AM
మెక్సికో బార్డర్ మీదుగా వలసలను అనుమతించే సీబీపీ యాప్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొన్ని నిమిషాలకే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ యాప్ సేవలు నిలిపివేస్తున్నట్టు నోటీసు విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోకి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని గతంలోనే ప్రకటించిన ట్రంప్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే సీబీపీ ఓన్ బోర్డర్ యాప్ సేవలను ముగిస్తున్నట్టు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ సోమవారం ప్రకటించింది. నైరుతి సరిహద్దు వెంబడి ఉన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీల మీదుగా అమెరికాలోకి ప్రవేశించేందుకు సీబీపీ యాప్ ద్వారా అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకునే సౌలభ్యం ఇకపై ఉండదని సీబీపీ శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జారీ చేసిన అపాయింట్‌మెంట్స్ అన్నీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. మెక్సికో సరిహద్దుగా మీదుగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారందరికీ ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది (Donald Trump).
Donald Trump: తొలి ప్రసంగంలోనే తానేం చేయబోయేది చెప్పిన ట్రంప్!
ఏమిటీ సీబీపీ వన్ యాప్..
ఉపాధీ కోసం మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలో ప్రవేశించే వారి కోసం ఈ యాప్ రెడీ చేశారు. ఈ యాప్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో రోజుకు 1450 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తారు. మెక్సికో సరిహద్దు వెంబడి ఉన్న 8 బార్డర్ క్రాసింగ్‌ల మీదుగా వీరిని ఉపాధి నిమిత్తం అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తారు. అమెరికా అధ్యక్షుడు జారీ చేసే ఇమిగ్రేషన్ పెరోల్ అనే ఆదేశాల సాయంతో వీరిని అమెరికాలోకి అనుమతిస్తారు. ఇక ట్రంప్ రాకతో నిమిషాల వ్యవధిలోనే ఈ సీబీపీ యాప్‌కు ముగింపు పడింది.
Read Latest and Internationl News
Updated Date - Jan 21 , 2025 | 01:44 AM