ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sheikh Hasina: పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హసీనాపై అధికారిక అభియోగాలు

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:15 PM

Bangladesh Former PM Sheikh Hasina: ఈ కేసుకు సంబంధించి ట్రిబ్యునల్ 81 మందిని ప్రత్యక్ష సాక్షులుగా నమోదు చేసింది. కాగా, 2024, ఆగస్టు నెలలో షేక్ హసీనా అధికారంలోంచి దిగిపోయింది. నిరసనలు, హింసలు ఎక్కువవటంతో ఆమె అధికారంలోంచి దిగిపోయి.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చేశారు.

Former PM Sheikh Hasina

గత సంవత్సరం జులై నెలలో బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆదివారం అధికారికంగా అభియోగాలు నమోదు అయ్యాయి. ఆమెపై మానవాళికి వ్యతిరేకంగా నేరాల కింద అభియోగాలు నమోదు అయ్యాయి. హసీనా ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా అభియోగాలు నమోదు అయ్యాయి.


చీఫ్ ప్రాసిక్యూటర్ తజుల్ ఇస్లాం స్పెషల్ ట్రిబ్యునల్ ఎదుట కేసును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ విద్యార్థులపై దాడి చేయమని షేక్ హసీనా భద్రతా దళాలను, అధికార పార్టీ కార్యకర్తలను, అనుబంధ గ్రూపులను ఆదేశించింది. దాని కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ హత్యలు అప్పటికప్పుడు ఏదో అనాలోచితంగా చేసినవి కావు. పక్కా ప్లాన్ ప్రకారం చేసినవి. దర్యాప్తులో భాగంగా ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలను, పలు మెసేజీలను సంపాదించాం’ అని అన్నారు.


ఈ కేసుకు సంబంధించి ట్రిబ్యునల్ 81 మందిని ప్రత్యక్ష సాక్షులుగా నమోదు చేసింది. కాగా, 2024, ఆగస్టు నెలలో షేక్ హసీనా అధికారంలోంచి దిగిపోయింది. నిరసనలు, హింసలు ఎక్కువవటంతో ఆమె అధికారంలోంచి దిగిపోయి.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం ఇండియాలోనే అజ్ణాతంలో ఉన్నారు. అధికారంలోంచి దిగిపోయే నాటికి ఆమె వరుసగా 15 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా పని చేశారు. ఆమె బంగ్లాదేశ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అమెరికా కనుసన్నల్లో నడిచే యూనస్ ప్రభుత్వం రాజ్యం ఏలుతోంది.


ఇవి కూడా చదవండి

మధుమేహం ఉన్నవారు రోజు ఎంతసేపు నడవాలి..

రూ.కోటికి పైనే నిధుల గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌

Updated Date - Jun 01 , 2025 | 03:15 PM