Christmas Celebrations: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN, Publish Date - Dec 26 , 2025 | 04:17 AM
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మ్‌సను గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. జీసస్ జన్మించిన పవిత్ర స్థలంగా భావించే వెస్ట్‌బ్యాంక్‌లోని బెత్లెహామ్ నగరానికి వేలాదిమంది తరలివచ్చారు.
రెండేళ్ల తర్వాత బెత్లెహామ్‌లో పండుగశోభ
బెత్లెహామ్, ఢిల్లీ, డిసెంబరు 25: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మ్‌సను గురువారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. జీసస్ జన్మించిన పవిత్ర స్థలంగా భావించే వెస్ట్‌బ్యాంక్‌లోని బెత్లెహామ్ నగరానికి వేలాదిమంది తరలివచ్చారు. గాజాలోని పాలస్తీనీయుల మీద ఇజ్రాయెల్ దాడుల కారణంగా గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో క్రిస్మస్ ఉత్సవాలు జరగలేదు. హమా్‌స-ఇజ్రాయెల్ శాంతి చర్చలతో యుద్ధం ముగిసిన నేపథ్యంలో.. ఈసారి బెత్లెహామ్‌కు క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పోప్ లియో.. వాటికన్ నుంచి ఇచ్చిన తన మొదటి క్రిస్మస్ సందేశంలో పాలస్తీనీయుల కడగండ్లను ప్రస్తావించటం విశేషం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన క్రిస్మస్ సందేశంలో.. పుతిన్ చావాలని ఉక్రెయిన్లందరూ కోరుకుంటున్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఢిల్లీలో ఓ చర్చిలో జరిగిన ప్రార్థనా సమావేశానికి, వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. విపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Dec 26 , 2025 | 04:17 AM