ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Iran And Israel War: ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా తప్పుబట్టిన చైనా

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:56 PM

Iran And Israel War: ఇరాన్‌పై అమెరికా చర్యను తాము ఖండిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ఐక్యరాజ్య సమితి హక్కులను ఉల్లంఘిస్తోందని అంది.

Iran And Israel War

ఇరాన్‌ న్యూక్లియర్ సైట్లపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇరాన్‌పై అమెరికా చర్యను తాము ఖండిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ఐక్యరాజ్య సమితి హక్కులను ఉల్లంఘిస్తోందని అంది. ‘ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా ఏ విధంగా స్పందిస్తుంది’ అని చైనా విదేశాంగ శాఖను మీడియా ప్రశ్నించింది. దీనికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సమాధానం ఇచ్చారు.

‘ఇరాన్ న్యూక్లియర్ సైట్లను టార్గెట్ చేస్తూ అమెరికా దాడులు చేయడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్య సమితి హక్కులను, అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. యుద్ధంలో భాగమైన అన్ని దేశాలు ఓ సారి ఆలోచించాలి. యుద్ధాన్ని ఆపాలి. చైనా శాంతి కోసం పని చేస్తుంది. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చక్కబడేలా కృషి చేస్తుంది’ అని స్పష్టం చేశారు.

కాగా, అంతకు క్రితం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇరాన్‌పై అమెరికా దాడులు చేయటంపై స్పందించారు. అమెరికా చర్యను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..‘మేము ఇరాన్‌లో మరింత పెరగబోయే ఉద్రిక్తతల గురించే ఆలోచిస్తూ ఉన్నాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కలిచివేస్తున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారితే ఆ ప్రాంతం పెద్ద మొత్తంలో పాడవుతుంది. యూఎన్ ఛార్టర్ ప్రకారం.. ఇరాన్ తనను తాను డిఫెండ్ చేసుకునే హక్కు ఉంది’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

యూఎస్ దాడులు.. ఇరాన్ కీలక నిర్ణయం..

అరుదైన దృశ్యం.. పొలంలో రాబందుల గుంపు

Updated Date - Jun 22 , 2025 | 09:59 PM