Israel Bombing: గాజాలో మృత్యుముఖాన 14వేల చిన్నారులు
ABN, Publish Date - May 21 , 2025 | 08:07 AM
గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల ఆహార సరఫరా వ్యవస్థ బందవుతుండటంతో 14వేల చిన్నారుల ప్రాణాలు ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఐరాస అధికారులు ఆహార అందకపోతే పిల్లలు గాయపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
టెల్‌అవివ్, మే 20: బాంబు దాడులతో గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధనం చేయడంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. గాజాలో ఒకే రోజున 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆహార సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడంతో చిన్నారుల పరిస్థితి దారుణంగా తయారయింది. 48 గంటల్లోగా ఆహారం అందకపోతే దాదాపు 14వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐరాస మానవతా సాయం విభాగాధిపతి ఫ్లెచర్ హెచ్చరించారు. బేబీఫుడ్ లోడులతో వేలాది లారీలు సరిహద్దులో ఉన్నాయని, వాటికి ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, గాజాకు ఎలాంటి సాయం అందకుండా 11 వారాల పాటు దిగ్బంఽధించడంపై బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రూరత్వమని, ఇందుకు నిరసనగా ఇజ్రాయెల్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Updated Date - May 21 , 2025 | 08:07 AM