Champions League: ఫుట్‌బాల్ అభిమానుల వేడుకలు హింసాత్మకం
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:15 AM
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చాంపియన్స్ లీగ్ ఫైనల్ తర్వాత పీఎస్‌జీ విజయంతో సంబరాలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు, 559 మందిని అరెస్టు చేశారు.
పారిస్‌లో ఇద్దరి మృతి.. 200 మందికి గాయాలు
పారిస్, జూన్ 1: ఫ్రాన్స్‌లో చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ అభిమానుల విజయోత్సవ వేడుకలు హింసాత్మకంగా మారాయి. రాజధాని పారిస్ వీధులు శనివారం రాత్రి అల్లర్లతో అట్టుడికాయి. ఫుట్‌బాల్ చాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ఇంటర్ మిలన్ జట్టుపై పారిస్ సెయింట్ జర్మైన్(పీఎ్‌సజీ) క్లబ్ గెలవడంతో వేలాది మంది అభిమానులు పారి్‌సలో సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి జట్టు అభిమానులకు పీఎ్‌సజీ అభిమానులకు పలుచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకుని తీవ్ర ఘర్షణలకు దారి తీశాయి. ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని.. 21 మంది పోలీసులు సహా 200 మందికి పైగా గాయపడ్డారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 559 మందిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:15 AM