ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brown University Shooting: అమెరికా యూనివర్సిటీలో కాల్పుల ఘటన.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

ABN, Publish Date - Dec 14 , 2025 | 10:26 AM

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మృతి చెందారు. 8 మంది గాయాల పాలయ్యారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Brown University Shooting

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో శనివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫిజిక్స్, ఇంజనీరింగ్ విభాగాలు ఉన్న బారస్ అండ్ హాలీ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయాలపాలయ్యారు. ముదురు రంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో నిందితుడు కాల్పులకు తెగబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది (Brown University Shooting Incident).

ఈ విషయమై పోలీస్ విభాగం డిప్యూటీ చీఫ్ టిమొతీ ఒహారా స్పందించారు. నిందితుడు భవనాన్ని వీడుతున్న వైనాన్ని కొందరు గుర్తించారని తెలిపారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. ఘటనపై మేయర్ బెయిలీ కూడా స్పందిస్తూ యూనివర్సిటీ పరిసరాలలోని జనాలు బయటకు రావ్వొద్దని హెచ్చరించారు. ఇక ఈ ఘటనలో 8 మంది గాయాలపాలయినట్టు కూడా మేయర్ తెలిపారు. అయితే, బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. అయితే, మృతులు విద్యార్థులా? కాదా? అన్న విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఈ ఘటనపై స్టూడెంట్స్‌ కూడా స్పందించారు. నిందితుడు తుపాకీ పట్టుకుని యూనివర్సిటీలో సంచరిస్తున్నాడని తెలియగానే తాము అప్రమత్తమయ్యామని చెప్పారు. కొందరు మంచాల కింద దాక్కోగా మరికొందరు తమ గదులకు తలుపులేసుకున్నారు.

ఇక ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందిస్తూ ఘటన గురించి తనకు సమాచారం అందిందని అన్నారు. ఎఫ్‌బీఐ ఘటనపై దృష్టిసారించిందని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఏ సాయమైనా చేసేందుకు ఎఫ్‌బీఐ సిద్ధంగా ఉందని తెలిపారు

ఇవీ చదవండి:

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2025 | 10:39 AM