Bangkok Road Collapse: బ్యాంకాక్‌లో కుప్పకూలిన రోడ్డు.. 50 మీటర్ల లోతైన సింక్‌హోల్
ABN, Publish Date - Sep 24 , 2025 | 06:45 PM
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఏకంగా 50 మీటర్ల మేర గుంత పడింది. దుసిత్ జిల్లాలోని సమ్సెన్ రోడ్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది.
బ్యాంకాక్, సెప్టెంబర్ 24: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఏకంగా 50 మీటర్ల మేర గుంత పడింది. దుసిత్ జిల్లాలోని సమ్సెన్ రోడ్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వాజిరా హాస్పిటల్ ముందు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ మార్గంలో ట్రాఫిక్ మూసివేశారు. పర్పుల్ లైన్ మెట్రో టన్నెల్ పైకప్పు డ్యామేజ్ కారణంగా రోడ్డు కుంగిపోయిందని బ్యాంకాక్ గవర్నర్ చద్‌చార్ట్ సిట్టిపుంట్ తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా వాజిరా హాస్పిటల్ ఔట్‌పేషెంట్ సేవలు తాత్కాలికంగా మూసివేశారు. 3,500 మంది అపాయింట్‌మెంట్ ఉన్న రోగులకు రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. అలాగే ఆస్పత్రిలోని రోగులను సైతం ఖాళీ చేయించారు. మరోవైపు సమ్సెన్ పోలీస్ స్టేషన్ సమీప భవనాల నుంచి ప్రజలను తరలించారు. వాజిరా ఇంటర్‌సెక్షన్ నుంచి సాంగి ఇంటర్‌సెక్షన్ వరకూ రోడ్లు మూసివేశారు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దీనిపై మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేఫ్టీపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News
Updated Date - Sep 24 , 2025 | 07:44 PM