Harassment: తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. శాసనసభ్యురాలికీ లైంగిక వేధింపులు
ABN, Publish Date - May 28 , 2025 | 08:07 AM
వాళ్లు.. దేశంలో ఉన్నత పదవుల్లోని వారు కావొచ్చు. అడ్డా కూలీలైనా కావొచ్చు. ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనా, నిరుపేద దేశమైనా సరే. ఆడవాళ్లను ట్రీట్ చేసే విధానంలో మగవాళ్ల బుద్ధి మారడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: వాళ్లు.. దేశంలో ఉన్నత పదవుల్లోని వారు కావొచ్చు. అడ్డా కూలీలైనా కావొచ్చు. అది, ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనా, నిరుపేద దేశమైనా సరే. ఆడవాళ్లను ట్రీట్ చేసే విధానంలో మగవాళ్లకు ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒక తోటి బాయ్ ఫ్రెండ్‌ను ఎలా ట్రీట్ చేస్తాడో.. అలాగే గర్ల్ ఫ్రెండ్‌ను కూడా ట్రీట్ చేయాలన్న ఆడవాళ్ల అభిలాష.. ఇప్పటికీ మగవాళ్లలో కనిపించడం లేదు. మహిళ అనేసరికి లైంగిక అవసరాలు తీర్చుకోవాలనుకునే మగవాళ్ల బుద్ధి మారడం లేదు. దీనికి ఆస్ట్రేలియా(Australia) సెనెటర్ అయిన పేమాన్(Senator Fatima Payman) తాజాగా చెప్పిన ఉదంతం మరో తార్కాణంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా సెనేటర్ ఫాతిమా పేమాన్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని,'టేబుల్ మీద డ్యాన్స్ చేయమని' బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించింది. వేధింపులపై తాను పార్లమెంటరీ వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. ఎవరు చేశారనే వివరాలు బహిర్గతం కాలేదు. కాగా, 2024లో గాజాలోని పాలస్తీనియన్లకు సహాయం చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సెనేటర్ పేమాన్.. వామపక్ష లేబర్ ప్రభుత్వం నుండి విడిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పుట్టిన పేమాన్.. తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 08:53 AM