Khyber Pakhtunkhwa: పాక్‌లో ఆత్మాహుతి దాడి..16 మంది మృతి
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:49 AM
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో శనివారం తాలిబన్ అనుకూల హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా...
పెషావర్, జూన్ 28: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలో శనివారం తాలిబన్ అనుకూల హఫీజ్ గుల్ బహదూర్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది భద్రతా సిబ్బంది మృత్యువాత పడగా, మరో 24 మందికి పైగా గాయపడ్డారని పాకిస్తాన్ సైన్యాధికారులు తెలిపారు. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని ఖాద్దీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే 13 మంది మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడు దాటికి రెండిళ్లపై కప్పు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడ్డారని జిల్లా పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Updated Date - Jun 29 , 2025 | 03:54 AM