Google Street View: గూగుల్ స్ట్రీట్ వ్యూలో అర్జెంటీనా వ్యక్తి నగ్న ఫొటో
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:34 AM
తన నగ్న చిత్రాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫొటోల్లో ఉంచారంటూ అర్జెంటీనాకు చెందిన ఓ వ్యక్తి కోర్టుకెక్కి పరిహారం పొందారు.
రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
బ్యూనస్ ఎయిర్స్, జూలై 28: తన నగ్న చిత్రాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫొటోల్లో ఉంచారంటూ అర్జెంటీనాకు చెందిన ఓ వ్యక్తి కోర్టుకెక్కి పరిహారం పొందారు. సదరు వ్యక్తి నగ్న ఫొటోను చిత్రీకరించి స్ట్రీట్ వ్యూ ఫొటోల్లో ఉంచినందుకు గూగుల్‌ను దోషిగా నిర్ధారించి.. బాధితుడికి నష్ట పరిహారంగా 12,500 అమెరికా డాలర్లు (రూ.10,81,750) చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. పోలీసు అధికారి అయిన బాధితుడు బ్రాగాడో పట్టణంలో ఉండే వారు. అయితే 2017లో ఆయన తన ఇంటి ముందు పెరటిలో పనిచేస్తుండగా వీధి గుండా గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం ఫొటోలు తీస్తూ వెళ్లింది. ఈ సమయంలోనే ఆయన బట్టలు లేకుండా ఉన్న ఫొటోను కూడా తీసింది. అనంతరం ఆ ఫొటోను ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. అందులో అతడి ఇంటి నంబర్‌తో పాటు వీధి పేరు కూడా స్పష్టంగా కనిపించింది. కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. టీవీ చానెళ్లలోనూ కథనాలు వెలువడ్డాయి. దీంతో తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..
Updated Date - Jul 29 , 2025 | 07:50 AM