ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pak Attack Khyber Pakhtunkhwa: పాక్‌ దళాల వైమానిక దాడులు.. సొంత ప్రజలే బలి

ABN, Publish Date - Sep 22 , 2025 | 02:20 PM

పాక్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో సొంత ప్రజలే సమిధలయ్యారు. ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంపై జరిగిన ఈ దాడిలో ఏకంగా 30 మంది సామాన్య పౌరులు కన్నుమూశారు.

Pakistan Air Force airstrike KP

ఇంటర్నెట్ డెస్క్: పాక్ పాలకులు మరో దారుణానికి తెగబడ్డారు. ఉగ్రవాద ఏరివేత చర్యల పేరిట యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో ఏకంగా 30 మంది సామాన్య ప్రజలు కన్నుమూశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు (Pakistan Air Force airstrike KP).

ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో షాష్‌తూన్ తెగ ప్రజలు అత్యధికంగా ఉండే మాట్రే దారా గ్రామంపై ఈ దాడి జరిగింది. సోమవారం తెల్లవారుజామును సుమారు 2 గంటల సమయంలో జేఎఫ్-17 విమానాలు ఎల్ఎస్-6 బాంబులతో దాడులు చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్నాయి. దాడుల కారణంగా ఆ గ్రామం ధ్వంసమైపోయింది. ఈ దాడుల్లో అనేక మంది గాయాల పాలయ్యారు. అయితే, పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది (Matre Dara village bombing).

గ్రామంలో దాక్కున్న తెహ్రీక్ ఏ పాకిస్థాన్ సంస్థ ఉగ్రవాదులను ఏరివేసేందుకు పాక్ ఈ దాడి చేసిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ దాడి బాధితులందరూ సామాన్యులేనని తెలిపింది. పర్వత ప్రాంతమైన ఖైబర్ పాఖ్‌తూన్‌‌ఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల పాక్ దళాలు ఉగ్రవాదుల ఏరివేత పేరిట పలు దాడులు చేశాయి (civilian casualties Pakistan). నిఘా వర్గాలు డేరా ఇస్మయిల్ ఖాన్ జిల్లాలో జరిపిన దాడిలో ఆదివారం ఏడుగురు టెర్రరిస్టులు మృతి చెందినట్టు పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక సెప్టెంబర్ 13-14 మధ్య ఇదే ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో సుమారు 31 టీటీపీ ఉగ్రవాదులు హతమయ్యారు. అప్ఘానిస్థాన్ సరిహద్దులోని పాక్ ప్రావిన్స్‌ల్లో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..

హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 03:01 PM