ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistani Army: 12 మంది పాక్ ఆర్మీ జవాన్లను చంపేసిన టీటీపీ

ABN, Publish Date - May 30 , 2025 | 06:18 PM

Pakistani Army: అంగూర్ అడ్డాలోని డీఆర్ఐ నిస్తార్ చెక్ పోస్టుపై జరిగిన దాడిలో 12 మంది పాక్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. నిస్తార్ చెక్ పోస్ట్‌పై దాడి చేసింది తమ గ్రూపునకు చెందిన వాళ్లేనని టీటీపీ ప్రకటించింది.

Pakistani Army

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు బలూచిస్థాన్ వేర్పాటు వాదులు.. మరో వైపు తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ దాడులతో అల్లాడిపోతోంది. తాజాగా, తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జరిపిన దాడిలో 12 మంది పాకిస్థాన్ జవాన్లు చనిపోయారు. అంగూర్ అడ్డాలోని డీఆర్ఐ నిస్తార్ చెక్ పోస్టుపై జరిగిన దాడిలో వారంతా చనిపోయారు. నిస్తార్ చెక్ పోస్ట్‌పై దాడి చేసింది తమ గ్రూపునకు చెందిన వాళ్లేనని టీటీపీ ప్రకటించింది. ఈ దాడిలో 12 మంది పాక్ జవాన్లు చనిపోయినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నిస్తార్ చెక్ పోస్ట్‌పై జరిగిన దాడిపై పాకిస్తాన్ ఆర్మీ అధికారులు స్పందించారు.


టీటీపీ దాడిలో 12 మంది చనిపోలేదని.. కేవలం నలుగురు మాత్రమే చనిపోయారని తెలిపింది. మరో ఏడు మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. చనిపోయిన వారిలో లెఫ్టినెంట్ డన్యాల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇక, సీనియర్ ఆఫ్ఘన్ తాళిబన్ కమాండర్ సాయిబుల్లా సయీద్ టీటీపీ దాడులను ఖండించారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ సరిహద్దుల వెంబడి అనధికారిక మిలటరీ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇస్లామిక్ చట్టాలను అతిక్రమిస్తున్నారు. తీవ్రవాద సంస్థలు జీహాద్ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి

థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

పిచ్చి పీక్స్.. నిద్రలేమికి మరీ ఇంత దారుణమైన ట్రీట్‌మెంటా..

Updated Date - May 30 , 2025 | 06:22 PM