ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : పొద్దునే ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటే.. డేంజర్‌లో పడతారు జాగ్రత్త..

ABN, Publish Date - Jan 05 , 2025 | 03:49 PM

ఆరోగ్యాన్ని కాపాడేది మనం అనుసరించే ఆహారపు అలవాట్లే. అయితే, తినే పదార్థాలు ఎంత మంచివైనా సరైన సమయంలో తీసుకోవడమూ చాలా ముఖ్యం. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎక్కువమంది తప్పు చేసేది ఈ విషయంలోనే..

Avoid Eating these Foods In morning Diet

ఆరోగ్యాన్ని కాపాడేది మనం అనుసరించే ఆహారపు అలవాట్లే. అయితే, తినే పదార్థాలు ఎంత మంచివైనా సరైన సమయంలో తీసుకోవడమూ చాలా ముఖ్యం. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చాలామంది తప్పు చేసేది ఉదయం తీసుకునే ఆహారం విషయంలోనే. నిజానికి ఖాళీ కడుపుతో మనం తినే పదార్థాలే ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఈ కింది ఆహార పదార్థాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తినకండి. తెలిసీ తెలియక ఈ ఆహార పదార్థాలు ప్రతి రోజూ తిన్నారో తీవ్ర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎన్ని వర్కవుట్లు చేసినా తినే ఆహారం సరైనది కాకపోతే ఆరోగ్యంగా లేనట్లే లెక్క అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంబించడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం మనం తినే అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకూ ఏఏ పదార్థాలు తింటున్నామనేది చెక్ చేసుకోవాలి. వాస్తవానికి ఖాళీ కడుపుతో పొద్దున్నే తీసుకునే భోజనమే మనం రోజంతా ఆరోగ్యంగా ఉంచేలా చూస్తుంది. ఎందుకంటే, దాదాపు 12 గంటల గ్యాప్ తర్వాత తీసుకునే మొదటి భోజనం ఇదే. అందుకే, ఏం తింటున్నారు.. ఏం తాగుతున్నారన్నది ఇక్కడ ప్రధానాంశంగా మారుతుంది. ఇదే మీ ఆరోగ్య పరిరక్షణకు ప్రథమ సూత్రం.


ఉదయాన్నే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం అవసరం. అప్పుడే పూర్తిస్థాయిలో రోజంతా సౌకర్యంగా పనిచేసే సామర్థ్యం వస్తుంది. పోషకాహార నిపుణులు ప్రకారం, ఈ పదార్థాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినటం ప్రమాదకరం.

కాఫీ-టీ

పొద్దున్నే లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి అలవాటు. ఖాళీ కడుపుతో ఇవి తాగటం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

సిట్రస్ పండ్లు

నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి, పండ్లు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నందున పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటి ఖాళీ కడుపుతో తింటే అదనపు యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, అల్సర్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు రావచ్చు.


అరటిపండు

అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయని అందరికీ తెలుసు. కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉన్న అరటిపండును ఖాళీ కడుపుతో తింటే శరీరంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు.

అధిక చక్కెరలు

స్వీట్లు, కేకులు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి అధిక చక్కెరగల ఆహారాలు మీ కడుపులోని ఫ్రక్టోజ్‌తో ఓవర్‌లోడ్ అవుతాయి. తద్వారా శరీరంలోని ఖాళీ కడుపులోకి చక్కెర ప్రవేశించినప్పుడు, ఇన్సులిన్ విభాగం కఠినంగా మారుతుంది. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది.

స్పైసీ ఫుడ్స్

అధిక మసాలాలు వేసి వండిన పదార్థాలు ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యం కలిగే అవకాశాలు అధికం. ఇది జీర్ణక్రియలో సమస్యలు సృష్టిస్తుంది.


పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ దంతాలతో పాటు మొత్తం శరీరంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో తింటే ఇందులోని యాసిడ్లు మీ కడుపులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి, ఏమీ తినక ముందు పెరుగు తీసుకోవడం అసిడిటీకి కారణం కావచ్చు.

వేయించిన పదార్థాలు

ముఖ్యంగా వేసవిలో ఉదయం పూట ఆయిల్ ఫుడ్ తినడం మీ శరీరానికి హానికరం. పూరీ, సమోసా, స్నాక్స్ ఇంకా బాగా వేయించిన ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో కొవ్వు, నూనెలు ఉండటం వల్ల ఇవి తింటే కడుపు బరువుగా మారుతుంది. వేడి వాతావరణ పరిస్థితుల్లో డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు.

వేయించిన ఆహారాలు

ఉదయాన్నే పూరీ లేదా స్నాక్స్, ఇంకా ఏదైనా వేయించిన ఆహారాలు తినడం వల్ల రోజంతా కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నూనె, కొవ్వు ఉండటం వల్ల కడుపు బరువుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల అజీర్ణం, నీరసంగా అనిపించవచ్చు.

Updated Date - Jan 05 , 2025 | 03:49 PM