ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asthma Risk: మహిళలూ.. రాత్రి షిఫ్టుల్లో చేస్తారా.. మీకీ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ

ABN, Publish Date - Jun 17 , 2025 | 10:21 AM

రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళల్లో ఆస్తమా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఆస్తమా బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వాళ్లకు హెచ్‌‌ఆర్‌టీ చికిత్స రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు.

Night Shift Asthma Risk

ఇంటర్నెట్ డెస్క్: పగటి పూట షిఫ్టుల్లో పనిచేసే మహిళలతో పోలిస్తే రాత్రి షిఫ్టుల్లోని ఉద్యోగినుల్లో ఓమోస్తరు నుంచి తీవ్ర స్థాయి ఆస్తమా ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. 2.7 లక్షల మందిని పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. దీని తాలూకు వివరాలు ఈఆర్ఏ ఓపెన్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. రాత్రి షిఫ్టుల్లోని పురుషుల్లో ఈ ముప్పు లేకపోవడాన్ని కూడా అధ్యయనకారులు గుర్తించారు. పురుషుల్లో ఆస్తమా ముప్పునకు పని వేళలకు మధ్య ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని గుర్తించారు.

ఈ అధ్యయనం ప్రకారం, పగటి పూట పనిచేసే వారితో పోలిస్తే రాత్రి షిఫ్టుల్లో చేసే మహిళల్లో ఆస్తమా ముప్పు ఏకంగా 50 శాతం పెరిగింది. ఆస్తమా ప్రభావం మహిళలపైనే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. తీవ్ర స్థాయి ఆస్తమా బారిన పడటం, ఆసుపత్రుల్లో చేరడం మహిళల్లో ఎక్కువని తేల్చారు.

పని వేళలు, ఆస్తమా ముప్పు, స్త్రీపురుష భేదాల మధ్య సంబంధం తెలుసుకునేందుకు జరిపిన తొలి అధ్యయనం ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. శాశ్వతంగా నైట్ షిఫ్టుల్లో పని చేసే మహిళల్లో ఆస్తమా రిస్క్ బాగా పెరిగినట్టు తాము గుర్తించామని తెలిపారు.

274,541 మందిని పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. వీరిలో 5.3 మంది ఆస్తమా రోగులు ఉన్నారు. ఆస్తమా రోగుల్లో 1.9 శాతం మందికి వ్యాధి ఓ మోస్తరు నుంచి తీవ్ర స్థాయిలో ఉంది. ఇన్‌హేలర్లు, స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో పని కారణంగా జీవ గడియారంలో మార్పులు వచ్చి స్త్రీపురుష హార్మోన్ల స్థాయిల్లో సమతౌల్యం దెబ్బతింటుందని తెలిపారు. ఈ అసమతౌల్యమే మహిళల్లో ఆస్తమా ముప్పు పెంచుతోందన్న అంచనాకు వచ్చారు.

ఇక హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటున్న మహిళలతో పోలిస్తే మెనోపాజ్ దాటిన మహిళల్లో ఆస్తమా ముప్పు రెండింతలైందని కూడా గుర్తించారు. కాబట్టి, రాత్రి షిఫ్టుల్లోని మహిళలకు హెచ్ఆర్‌టీ ఓ కవచంలా రక్షణ ఇస్తుందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

గుండె పోటు.. ఈ అపోహలు ఉంటే వెంటనే తొలగించుకోండి

అపాన వాయువుకు వేగంగా చెక్ పెట్టే పరిష్కారాలు

Read Latest and Health News

Updated Date - Jun 17 , 2025 | 11:25 AM