ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Boiled Vegetables: పచ్చిగా కాదు.. ఈ కూరగాయలను ఉడకబెట్టి తింటేనే..

ABN, Publish Date - Jun 14 , 2025 | 07:55 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది కూరగాయలను పచ్చిగా తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం కంటే ఉడికించి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vegetables

Vegetables: ఈ మధ్య కాలంలో చాలా మంది కూరగాయలను పచ్చిగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఇలా తింటే పోషకాలు పుష్కలంగా అందుతాయని అనుకుంటారు. అయితే, కొన్ని కూరగాయలను పచ్చిగా తినడం కంటే ఉడికించి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా ఉడకబెట్టడం వలన వాటిలోని పోషకాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు. అయితే, ఏ కూరగాయలను ఉడకబెట్టడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యారెట్

చాలా మంది క్యారెట్‌ను సలాడ్‌లా పచ్చిగానే తింటారు. కానీ క్యారెట్‌ను ఉడికిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల అందులోని బీటా కెరోటిన్ శరీరానికి సులభంగా అందుతుంది. ఇది విటమిన్ Aగా మారి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

పాలకూర

పాలకూరను పచ్చిగా తినడం వల్ల దానిలోని ఆక్సాలిక్ ఆమ్లం శరీరానికి ఐరన్‌ను పూర్తిగా అందనివ్వదు. అయితే, పాలకూరను కొంచెం ఉడికిస్తే ఈ ఆమ్లం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ఐరన్, కాల్షియం శరీరానికి బాగా అందుతాయి.

బ్రోకలీ

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సి, కే పుష్కలంగా ఉంటాయి. కానీ దీన్ని పచ్చిగా తినడం మంచిది కాదు. బ్రోకలీని ఉడికించి తినడం మంచిది. ఇది జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ పై ఎలాంటి ప్రభావం చూపించదు.

టమాటో

టమాటోను ఉడికిస్తే దాంట్లో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరానికి ఎక్కువగా లభిస్తుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్‌ను ఉడికిస్తే దానిలోని నైట్రేట్‌లు బాగా పనిచేస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, బీపీ ను తగ్గిస్తాయి. అలాగే శరీర శక్తిని పెంచుతాయి.

చిలగడదుంప

చిలగడదుంపలు ఉడికిస్తే అందులోని బీటా కెరోటిన్ బాగా అందుతుంది. ఇది కంటి చూపు, చర్మం, రోగనిరోధక శక్తికి మంచిది.

బంగాళదుంప

బంగాళదుంపను ఉడికిస్తే దాంట్లోని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అలాగే విటమిన్ C, B6 కూడా అందుతుంది. ఇది శరీరానికి శక్తి ఇస్తుంది. ఈ కూరగాయల్ని సాధారణంగా ఉడకబెట్టి తింటే మంచి పోషకాలు ఎక్కువగా అందుతాయని ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

కంటి చూపు బాగుండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఈ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ డౌన్..

For More Health News

Updated Date - Jun 14 , 2025 | 03:52 PM