ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weight Loss Tips : నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గేందుకు.. ఈ నీళ్లు తాగండి..

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:38 PM

పొట్ట, నడుము చుట్టూ ఫ్యాట్ పెరిగిపోతుందా. ఎంత ప్రయత్నించినా తగ్గించుకోలేకపోతున్నారా. ఈ డ్రింక్ తాగితే చాలా ఈజీగా ఫ్యాట్ తగ్గిపోయి నాజుకైన నడుము మీ సొంతమవుతుంది..

Waist Fat Loss Tips

గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, ఫోన్ చూస్తూ అర్ధరాత్రి దాటినా నిద్రపోకపోవడం, నచ్చిన ప్రతిదీ తినేయటం.. ఇలా నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ఎన్నో రకాల కారణాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక, మెనోపాజ్ దశలోనూ మహిళలు అధిక బరువు సమస్య వేధించడం సాధారణమే. అయితే, అనారోగ్యకర అలవాట్ల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి ఇప్పుడు టీనేజీ దశలోనే అందరూ ఊబకాయులుగా మారిపోతున్నారు. అప్పటిదాకా సన్నజాజి తీగలా నాజూగ్గా ఉన్న నడుము కొలతలు ఒక్కసారిగా మారిపోతే అమ్మాయిలు అస్సలు తట్టుకోలేరు. శరీర బరువు తగ్గించుకోవడం కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గించుకోవడం సవాలే. తిరిగి మునుపటిలా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యేవారే ఎక్కువ. అయితే, ఈ నీటిని తాగితే నడుము నాజూగ్గా మారిపోవడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


నడుము చుట్టూ కొవ్వు కరిగిపోవాలంటే..

ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది ప్రజలు స్థూలకాయానికి గురవుతున్నారు. బరువు పెరగడం ప్రారంభించిన తర్వాత దానిని తగ్గించడం చాలా కష్టం. ఊబకాయం వల్ల కొవ్వు మాత్రమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. మీరు బరువు తగ్గడానికి పసుపు నీటిని తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో పసుపు నీళ్లను తాగితే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.పసుపు నీరు తాగడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.


పసుపు నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడమే కాదు. బరువును వేగంగా తగ్గించేందుకు ఉపకరిస్తాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పసుపు నీరు త్రాగాలి. పసుపు నీటి తయారీ కోసం పచ్చి పసుపు ఉపయోగించండి. పచ్చి పసుపు మంచిదని భావిస్తారు.


బరువు తగ్గడానికి బలమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా అవసరం. పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. కడుపులోని వ్యర్థాలు మొత్తం బయటికి వెళ్లేలా చేసి త్వరగా బరువు తగ్గుతారు. పసుపు నీటిని రోజూ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి శరీరం తేలికగా అవుతున్న అనుభూతిని పొందుతారు.


పసుపు నీటి తయారీ విధానం..

పచ్చి పసుపు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో పచ్చి పసుపు తురిమి వేయండి. తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా మారేంతవరకూ వేడి చేయండి. కాచిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి.

Updated Date - Jan 20 , 2025 | 01:41 PM