Oats Health Benefits: ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
ABN, Publish Date - Jun 15 , 2025 | 09:27 AM
ప్రతిరోజూ ఓట్స్ తింటే మీ శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఓట్స్‌ను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. పండ్లు, గింజలు, విత్తనాలతో కలిపి రోజూ ఓట్స్ తినడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఓట్స్ తింటే శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును తేలికగా ఉంచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఓట్స్ నీటిని పీల్చుకొని జెల్‌లా మారి, మలాన్ని సాఫీగా బయటకు పంపడానికి తోడ్పడతాయి. దీంతో గ్యాస్, ఉబ్బరత వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి.
కడుపు నిండిన అనుభూతి
ఓట్స్‌ను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవ్వడం వల్ల, ఎక్కువసేపు శక్తిని అందిస్తూ కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది
బొడ్డు భాగంలో ఉన్న కొవ్వును కరిగించడం చాలా కష్టం. అయితే ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు ఆకలిగా లేకుండా చేస్తుంది. ఈ విధంగా, అనవసరమైన తినే అలవాట్లు తగ్గి కొవ్వు నిల్వ తగ్గుతుంది.
చర్మం మెరిసిపోతుంది
ఓట్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి, చర్మాన్ని సహజంగా మెరిపిస్తుంది. పొడిబారిన చర్మం, ఎరుపు దద్దుర్లు వంటి సమస్యలకూ ఓట్స్ ఉపశమనం కలిగిస్తాయి. అందుకే చాలా బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా ఓట్స్ ఉపయోగిస్తారు.
శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి
ఓట్స్ తిన్న తర్వాత శరీరంలో శక్తి ఒక్కసారిగా రాకుండా నెమ్మదిగా విడుదల అవుతుంది. ఈ ఫలితంగా, రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ, పని చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఓట్స్ ఉపయోగపడతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
అహ్మదాబాద్ టూ పహల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక విషాదాలు..
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
For More National News
Updated Date - Jun 15 , 2025 | 09:27 AM