Palak Paneer: పాలక్ పనీర్ కలిపి తింటున్నారా.. ఇక అంతే..
ABN, Publish Date - Jun 11 , 2025 | 09:50 AM
కొన్ని ఆహార పదార్థాలతో పనీర్ తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలకూర కూడా ఈ ఆహారాలలో ఒకటి. దీనిని పనీర్‌తో కలిపి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Palak Panner Curry: పనీర్ అంటేనే మంచి ప్రోటీన్ వనరు. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే చాలా మంది తమ రోజువారీ ఆహారంలో పనీర్‌ను చేర్చుకుంటారు. అలాగే పాలకూర కూడా ఆరోగ్యానికి మంచిదే, ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పనీర్‌లో ఉన్న కాల్షియం, పాలకూరలో ఉన్న ఐరన్‌ను ఒకేసారి శరీరం సరిగ్గా గ్రహించలేదు. అంటే రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందకపోవచ్చు.
జీర్ణ సమస్యలు
పనీర్, పాలకూర కలయిక జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, మలబద్ధకం, పేగులలో అసౌకర్యం లాంటి సమస్యలు రావచ్చు.
రక్తహీనత
పాలకూరలో ఉన్న ఐరన్‌ను శరీరం గ్రహించేందుకు ప్రయత్నించినప్పుడు, పనీర్‌లోని కాల్షియం ఆటంకం కలిగిస్తుంది. దీంతో శరీరం ఐరన్‌ను సరిగ్గా గ్రహించకపోవచ్చు. దీని వల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
కిడ్నీలో రాళ్లు
పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. పనీర్‌లో ఎక్కువగా ఉండే కాల్షియంతో ఇది కలిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పనీర్, పాలకూర ఈ రెండూ కూడా మంచివే. కానీ రెండింటినీ కలిపి తినడం శరీరానికి హానికరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని వేరువేరుగా తినడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలా.. ఈ చిట్కాలు పాటించండి
ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు..
For More Health News
Updated Date - Jun 11 , 2025 | 10:07 AM